తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో జంపింగ్ జపాంగ్ జంపాక్ జంపాక్ - ఎవరెవరు ఎటువైపు వెళ్తున్నారో? - Party Migrations In Telangana

Party Jumpings in Telangana : లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ తెలంగాణాలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఒకవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటన. మరొకవైపు నాయకులు భేటీలు, చేరికలతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాగా, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ని మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం కలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎవ్వరూ పార్టీ మారతారో ఎవరు పార్టీలో ఉంటారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.

Party Migrations in Telangana
Party Jumpings in Telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 8:12 AM IST

Updated : Mar 15, 2024, 8:54 AM IST

రాష్ట్రంలో పార్టీ జంపింగ్​ సీజన్ షురూ టికెట్ కోసం ఏ పార్టీ కండువ కప్పుకోవడానికైనా రెడీ

Party Jumpings in Telangana :రాష్ట్రంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇతర పార్టీలోని అసంతృప్త నేతలే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మహబూబ్​నగర్‌ బీజేపీ టికెట్‌ ఆశించి నిరాశకు గురైన జితేందర్‌ రెడ్డిని (BJP Jithender Reddy) ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఆ స్థానంలో సీటీ బీజేపీ ఉపాధ్యాక్షురాలు డీ.కే. అరుణకు ఇవ్వడంతో టికెట్‌ రానంత మాత్రాన ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని జితేందర్‌ రెడ్డికి తెలిపినట్లు సమాచారం.

జితేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటే మల్కాజిగిరి లోక్‌సభ టికెట్‌ ఇస్తామని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందుకు జితేందర్‌ రెడ్డి సానుకూలంగా స్పందించలేదని, మరికొంత సమయం కావాలని సీఎంకు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జితేందర్‌ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారా? లేక కాంగ్రెస్‌ గూటికి చేరి లోక్‌సభ బరిలో నిలుస్తారా అనే స్పష్టత రావాల్సి ఉంది.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు - రాజకీయాల నుంచి తప్పుకుంటా : మల్లారెడ్డి

CM Revanth Reddy Meets BJP Jithender Reddy :రేవంత్‌ రెడ్డిపై (CM Revanth Reddy) మండి పడే మల్లారెడ్డి సైతం మౌనందాల్చారు. ఇటీవల మల్లారెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేతకు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల నడుమ మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్‌ రెడ్డితో కలిసి సీఎం సలహాదారు వేం నరేందర్​రెడ్డిని కలిశారు. ఈ భేటీతో మల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరుసటి రోజే కేటీఆర్‌ను కలిసి తాను పార్టీ మారటం లేదని బీఆర్​ఎస్​లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.

తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్లారెడ్డి (Malla Reddy) ఆయన కుమారుడు భద్రారెడ్డితోపాటు అల్లుడు రాజశేఖర్‌ రెడ్డిలు కలిశారు. వీరు కలిసినట్లు ఓ ఫోటో లీక్‌ కావడం, అది మీడియాలో చక్కర్లు కొట్టడంతో మరొకసారి మల్లారెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా తాను బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు డీకే శివకుమార్‌ను కలిసినట్లు మల్లారెడ్డి వెల్లడించారు. అందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు.

బీఆర్​ఎస్​కు మరో షాక్ - కాంగ్రెస్​లోకి గుత్తా అమిత్​ రెడ్డి !

Malla Reddy On Party Changing : తాను బీఆర్​ఎస్​లోనే కొనసాగుతానని మల్లారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లు తాను ప్రజాసేవ చేస్తానని ఆ తరువాత తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. కుమారుడు భద్రారెడ్డిని మాత్రం రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా బీఆర్​ఎస్ (BRS), బీజేపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. అయితే వీరంతా మర్యాదపూర్వకంగా కలుస్తున్నట్లు చెబుతున్నప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీకి షాక్​ - జితేందర్​రెడ్డిని కలిసిన సీఎం రేవంత్​ రెడ్డి

Last Updated : Mar 15, 2024, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details