Parents Protest Daughter House in Malkajgiri :డబ్బు డబ్బు నువ్వు ఏం చేస్తావ్? అంటే ప్రాణ స్నేహితులను విడగొడతాను. తండ్రీ పిల్లల మధ్య చిచ్చు పెడతాను. మనుషులు విచక్షణ కోల్పోయేలా చేసి బంధాలు తెంచేస్తానని చెబుతుంది అనేది ఓ నానుడి. నేటి కాలంలో ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసేవారు. కానీ నేడు ఆస్తిపాస్తులు, డబ్బుకు విలువ ఇస్తున్నారు. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులనైనా మోసం చేసేందుకు సిద్ధపడుతున్నారు.
డబ్బుంటే చాలు ఏది అవసరం లేదన్న రీతిలో కొందరి వ్యవహారం ఉంటుంది. ఈ ఘటన చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. తాజాగా కుమార్తెనే తమను మోసం చేసిందని ఓ తల్లిదండ్రులు నిరసనకు దిగారు. బంగారు ఆభరణాలను దాచి ఉంచమని ఆమెకు ఇవ్వడమే వారు చేసిన అపరాధమా!. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఉదంతం తెలంగాణలోని మల్కాజిగిరిలో చోటుచేసుకుంది.
మల్కాజిగిరి సర్కిల్ వాణీనగర్‌లో కన్న కుమార్తెనే మోసం చేసిందని తల్లిదండ్రులే ఆమె ఇంటి ముందు నిరసనకు దిగారు. ఊరెళ్తూ తమ వద్ద ఉన్న 30 తులాల బంగారాన్ని ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చామని, ఇప్పుడు తిరిగి ఇవ్వమంటే ఆమె నిరాకరిస్తుందని ఆరోపించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం శివమ్మ, మల్లయ్య దంపతులు మల్కాజిగిరి సర్కిల్లో నివాసం ఉంటున్నారు. కుమార్తె బాలమణి వారి ఇంటికి సమీపంలోనే ఉంటోంది.