Panjagutta Police Station Controversies : ఒకప్పుడు దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు. హైదరాబాద్‌లోనే కీలకమైన ప్రాంతం. దీని పరిధిలో సుమారు 3.5లక్షల మంది జనాభా. ఐదు సెక్టార్లు. 130 మందికి పైగా పోలీసు సిబ్బంది. అంతటి ప్రాధాన్యత ఉన్న పంజాగుట్ట ఠాణాను వివాదాలు వెంటాడుతున్నాయి. నెలరోజుల డ్రంకన్‌డ్రైవ్ కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోవటం సంచలనంగా మారింది.
శుక్రవారం రాత్రి పాతబస్తీకి చెందిన అమీర్‌అలీ అనే దొంగ మద్యం మత్తులో కారు నడుపుతూ పంజాగుట్ట వద్ద బీభత్సం సృష్టించాడు. స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలకు తరలించగా పోలీసుల (Panjagutta Police ) కళ్లుగప్పి పారిపోయాడు. గత నెల 23 అర్ధరాత్రి దాటాక ఖరీదైన కారు మితిమీరిన వేగంతో ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ కారు నడిపినట్టుగా నిర్ధారించారు.
ఈ ఘటనలో ఇదే ఠాణాలో అప్పటి ఇన్‌స్పెక్టర్ దుర్గారావు స్వయంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని తన కారులో స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించేందుకు అతడిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి పారిపోయిన సాహిల్ తన స్థానంలో డ్రైవర్‌ను నిందితుడిగా పోలీస్‌స్టేషన్‌కు పంపాడు. ఈ వ్యవహారంలో సీఐ సహకరించినట్టు ఉన్నతాధికారుల విచారణలో రుజువు కావటంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
మొన్న మరియమ్మ.. నేడు ఖదీర్ ఖాన్.. పోలీసుల థర్డ్ డిగ్రీతో బలవుతున్న అమాయకులు