Panic Among people Living in Hilly Areas of Visakh:చుట్టూ కొండలు అందులోనే ఇళ్లు. వర్షాకాలం వచ్చిందంటే చాలు బండరాళ్లు జారి రోడ్లు ఛిద్రమవుతున్నాయి. చినుకు పడితే చాలు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు విశాఖలోని కొండవాలు నివాసితులు. ఎప్పుడు ఏ రాయి మీద పడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కేరళలోని వయనాడ్ కొండచరియల ఘటనతో స్థానికుల్లో భయం రెట్టింపు అయింది. తక్షణమే రక్షణ గోడ నిర్మించకపోతే పెద్ద ప్రమాదం తప్పదంటున్న స్థానికులు వాపోతున్నారు.
విశాఖలో కొండవాలు ప్రాంతాలలో నివసించే జనాభా సంఖ్య ఎక్కువ. హనుమంతువాక, పెద్ద గదిలి, చిన్న గదిలి, కైలాసపురం, విశాలాక్షినగర్, వెంకోజీపాలెం ఇలా పలు ప్రాంతాల్లో ఎక్కువ మంది జనాభా కొండవాలు ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారంతా పేద, మధ్య తరగతి ప్రజలే. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షపు నీటి ధాటికి బండరాళ్లు దొర్లి కిందకు పడుతుంటాయి. దీంతో జనాలు భయాందోళనకు గురవుతుంటారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో బండరాళ్లు దొర్లి ఇళ్ల మీదకు వస్తాయని అక్కడి జనాభా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్టీరింగ్ పట్టిన అనంత అమ్మాయి - ఆర్టీసీలో చేరేందుకు శిక్షణ - Anantapur Lady Driver