తెలంగాణ

telangana

ETV Bharat / state

'అందుకు అనుమతులు తీసుకోండి' : సినీనటుడు అలీకి అధికారుల నోటీసులు - PANCHAYATI RAJ NOTICE TO ACTOR ALI

సినీనటుడు అలీకి నోటీసులు - అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలు - నోటీసులు జారీ చేసిన ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ అధికారులు

Panchayati Raj Notice To Actor Ali
Panchayati Raj Notice To Actor Ali (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2024, 12:14 PM IST

Panchayati Raj Notice To Actor Ali : సినీనటుడు అలీకి వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసింది. ఫామ్‌హౌస్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని నోటీస్‌లో పేర్కొంది. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఆయనకు నోటీసీలు ఇచ్చారు. నిర్మాణాలు ఆపివేయాలని తెలిపారు.

ఎక్‌మామిడి రెవెన్యూ పరిధి సర్వే నెంబరు 345లోని ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలకు సంబంధించి పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే అలీకి నోటీసులు జారీ చేశారు. ఆయన స్పందించకపోవడంతో తాజాగా మళ్లీ రెండోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. నిర్మాణానికి సంబంధించిన ధ్రువ పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలని సూచించారు. లేని పక్షంలో పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details