OU JAC Leaders Complaint Against Allu Arjun Fans :హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఇంటిపై దాడి చేసినందుకు వెంటనే హీరో అల్లు అర్జున్‌కు క్షమాపణ చెప్పాలని అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ అభిమానుల పేరుతో వందల కాల్స్ వస్తున్నాయని జేఏసీ నేతలు ఆరోపించారు. చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ అభిమానుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ ఫోన్ నంబర్లను అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారని ఓయూ జేఏసీ నేతలు తమ ఫిర్యాదులో తెలిపారు. తమకు ఫోన్ కాల్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత అల్లు అర్జున్దేనన్నారు. ఫోన్ కాల్స్ ఆగకపోతే వేలాది మందితో అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. పోన్ చేసి బెదిరిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
'అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - లోపలికి చొరబడి పూలకుండీలు ధ్వంసం'
అసలేం జరిగిందంటే :సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఇటీవల ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అర్జున్ ఇంటివద్ద ఆందోళనకు దిగారు. రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ నివాసంపై రాళ్లను విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ఓయూ జేఏసీ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాళ్లు తగిలి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు చేయడం సరికాదన్నారు. ఈ తరహా ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనతో సంబంధంలేని పోలీసు సిబ్బంది స్పందించవద్దని, ఉన్నతాధికారులు ఈ ఘటనపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సంధ్య థియేటర్ ఘటన - లైవ్ వీడియో విడుదల చేసిన పోలీసులు
అల్లు అర్జున్ హీరో కావొచ్చు కానీ పౌరుడే కదా - సంధ్య థియోటర్ ఘటనపై స్పందించిన డీజీపీ