Young Man Raped a Woman in Hyderabad :సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. తెలియని వ్యక్తుల పరిచయాలతో జాగ్రత్త పడకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తిని నమ్మిన ఓ యువతి అత్యాచారానికి గురైన ఘటనలో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానంటూ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో రాజశేఖర్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పల్ ప్రాంతానికి చెందిన యువతి(27) వివాహం చేసుకోవడానికి యాప్‌లో శోధిస్తుండగా, ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జయప్రకాష్‌నగర్‌లో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న ముత్తుమ్ముల రాజశేఖర్(30) పరిచయమయ్యాడు. తాను ఫొటోగ్రాఫర్‌నని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరిచయం పెంచుకున్నాడు.
తప్పతాగి బస్‌స్టాండ్‌లో యువకుల హల్‌చల్ - పోలీసులు భలే పనిష్మెంట్ ఇచ్చారుగా!! - Police punishment To Youth
ఈ సందర్భంగా యువతి తరచూ అతడి ఫొటోస్టూడియోకు వెళ్తుండేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిత్యం పెరిగింది. ఫొటో ఎడిటింగ్‌కు, ఇతర అవసరాలకు సదరు వ్యక్తి యువతికి చెందిన ఈ-మెయిల్ ఐడీని కూడా వినియోగించేవాడు. ఈ క్రమంలో ఆమె మెయిల్‌ను హ్యాక్ చేసి దానికి అటాచ్ అయి ఉన్న అకౌంట్లలో నుంచి ఆమె ఫొటోలు సేకరించాడు.
గత నెల 24న యువతికి ఫోన్ చేసిన రాజశేఖర్ తన ఫొటో స్టూడియోకు రమ్మని పిలిచాడు. మరుసటి రోజు స్టూడియోకు వెళ్లిన యువతిని బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకపోతే మెయిల్ ద్వారా లభ్యమైన ఆమె ఫొటోలను అందరికీ పంపి పరువు తీస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని హెచ్చరించాడు. బాధితురాలు అక్కడి నుంచి బయటపడి సమీప బంధువైన మహిళకు విషయం చెప్పింది. వారు ఉప్పల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉప్పల్ ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్ అయిన ఈ కేసు ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్‌కు బదిలీ కావడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు.
షాద్ నగర్లో దారుణం - యువతిపై కత్తితో దాడి