Ongole Police Are Ready to Arrest Ram Gopal Varma :సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అరెస్టుకు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ఒంగోలు గ్రామీణ పోలీసు స్టేషన్‌కు నేడు ఆర్జీవీ విచారణకు రావాల్సి ఉండగా, ఆయన హాజరు కాలేదు. దీంతో పోలీసులు అరెస్టుకు సిద్ధమయ్యారు. వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా, దానిపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసుల విచారణకు రెండోసారీ డుమ్మా - అరెస్ట్ చేసేందుకు RGV ఇంటికి పోలీసులు! - POLICE ARE READY TO ARREST RGV
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఒంగోలు పోలీసులు సిద్ధం - విచారణకు హాజరుకాకపోడంతో చర్య

Published : Nov 25, 2024, 11:21 AM IST
|Updated : Nov 25, 2024, 12:42 PM IST
నాలుగు రోజుల సమయం కావాలంటూ వాట్సాప్ మెసేజ్ : దీనిపై నవంబరు 19న ఒంగోలు గ్రామీణ సీఐ కార్యాలయంలో రామ్‌గోపాల్ వర్మ విచారణకు హాజరు కావాల్సి ఉండగా కాలేదు. ఈ విషయంపై మద్దిపాడు పోలీసులకు ఆర్జీవీ వాట్సాప్ మెసేజ్ చేశారు. విచారణకు రావటానికి తనకు 4 నాలుగు రోజుల సయం కావాలని కోరినట్లు తెలిసింది.
నవంబర్ 13న ఎస్సై శివ రామయ్య ఆధ్వర్యంలోని పోలీసుల బృందం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆర్జీవీ నివాసానికి వెళ్లి ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న ఆర్జీవీ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులు కొట్టి వేయాలని కోరారు.