Officials Inspections in Stella Panama ship at Kakinada Port :కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన స్టెల్లా పనామా నౌకలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బుధవారం ఉదయం కాకినాడ ఎస్పీఎఫ్, కష్టమ్స్ కార్యాలయాల సమీపం నుంచి రెవెన్యూ, పోలీస్, పౌరసరఫరాలు, పోర్ట్, కస్టమ్స్ విభాగాలకు చెందిన 10 మంది అధికారుల బృందం సముద్రంలోకి వెళ్లింది. స్టెల్లా ఎల్ పనామా నౌక వద్దకు చేరుకున్న అధికారులు వెంటనే తనిఖీలు మొదలుపెట్టారు. నౌకలో 5 హాచెస్ ఉండగా ఇప్పటివరకు 3 హాచెస్లో ఉన్న బియ్యం సేకరించారు.
నౌకలో 15 అడుగుల లోతులో బియ్యం నింపేశారు. అయితే అధికారులు మాత్రం పైన ఉన్న. బస్తాల్లోని బియ్యాన్ని సేకరిస్తున్నారు. మిగతా రెండు హ్యాచెస్లోనే బియ్యం నమూనాలు సేకరించనున్నారు. స్టెల్లా నౌక 58 వేల టన్నుల సామర్థ్యం ఉండగా ఇప్పటికే 38 వేల టన్నుల బియ్యాన్ని నింపారు. సేకరించిన నమూనాలు పరీక్షలు చేసిన అనంతరం రేషన్ బియ్యం ఎంత మేర ఉందనేది తేల్చనున్నారు. ఆ తర్వాత నౌకలో బియ్యం సీజ్ చేయాలా లేదంటే నౌకనే సీజ్ చేయాలన్న అంశం అధికారులు తేల్చనున్నారు.