NO Public in CM Jagan Bus Yatra Meeting: సిద్ధం సభకు ఎలాగైనా జన సమీకరణ చేయాలని కొందరు వైసీపీ నేతలు ప్రజలకు ప్రలోభాల గాలం వేసి తరలించారు. భీమవరంలో జరిగే బహిరంగ సభకు వస్తే రూ.500, మద్యం, రెండు పూటలా బిర్యానీ ఇస్తామంటూ సమీకరణ చేశారు. ఊరూరా జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి ఎంతమందిని రప్పించాలో నాయకులు టార్గెట్లు పెట్టుకుంటున్నారు. రావులపాలెం, కొవ్వూరు, కాకినాడ, ఏలేశ్వరం, తణుకు డిపోల నుంచి బస్సులు ఉదయమే ఆయా గ్రామాలకు చేరుకోగా మధ్యాహ్నం నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరాయి.
భీమవరంలో సీఎం బస్సు యాత్ర - రోడ్డుకు ఇరువైపులా చెట్లు తొలగింపు - CM Jagan Tour Trees Cuts
సీఎం సభ నుంచి వెళ్లిపోయిన జనం: పెనుగొండ మండలంలో బస్సుకు రూ.10 వేల చొప్పున అందజేసినట్లు తెలిసింది. అయితే రెండు రోజుల ముందు నుంచే వైసీపీ శ్రేణులు, గ్రామ స్థాయి కార్యకర్తలు ప్రైవేట్ సైన్యమైన గృహ సారథులు, కన్వీనర్లు ఎవరెవరు సభకు వస్తున్నారంటూ కసరత్తు చేశారు. బస్సు ఎక్కగానే నగదు, మద్యం, రెండు పూటలా బిర్యానీలు ఇస్తామంటూ ప్రచారం చేశారు. పింఛను, రేషన్‌కార్డు, సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇళ్ల స్థలాల లబ్ధిదారులు తప్పనిసరిగా రావాలంటూ హుకుం జారీ చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమని జనాలకు మభ్య పెట్టి సభకు తరలించారు. సభకు రాకుంటే పథకాలు నిలిపివేస్తామంటూ రాజీనామా చేసిన వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడటంతోపాటు నగదు, మద్యం, బిర్యానీ అని గాలం వేసి జనాన్ని తరలించారు.