Nitin Gadkari Comments at Election Campaign: మన్యం జిల్లా పార్వతీపురం మండలం వెంకంపేటలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీలున్న ప్రతిచోటా నీటిని సంరక్షించుకోవాలని నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు.
మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి పనులు చేశామని, రైతుల కోసం చేసిన పనుల్లో 9 డాక్టరేట్లు వచ్చాయని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో 90 శాతం మంది పల్లెల్లోనే ఉండేవారని, ఇప్పుడు పల్లెల నుంచి 30 శాతం మంది నగరాలకు వలస వెళ్తున్నారని అన్నారు. పల్లెల్లో సాగుచేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని పేర్కొన్నారు. ధాన్యం, పంచదార, జొన్నలకు మద్దతుధర కల్పించాలన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి రూ.లక్షల కోట్లు చెల్లిస్తున్నామని చెప్పారు.
7, 8 తేదీల్లో ఏపీకి ప్రధాని మోదీ - నేడు నడ్డా, గడ్కరీ - PM Modi election campaign in Andhra
ఎన్డీఏ ప్రభుత్వంతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని నితిన్ గడ్కరీ అన్నారు. నరేంద్ర మోదీ అన్ని రంగాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి, రహదారుల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని పేర్కొన్నారు. బయో ఇంధనం ప్రతి ఒక్కరు వినియోగించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు. అభివృద్ధి చెందిన అమెరికాలో రోడ్లు బాగున్నాయని అందరూ అంటారని, రోడ్లు బాగుండటం వల్లే దేశం అభివృద్ధి చెందిందని, అందుకోసం దేశంలో అనేక రహదారులను అభివృద్ధి చేస్తున్నామని గట్కరీ వివరించారు.
పార్వతీపురం జిల్లాలో సాగు, తాగునీరు సమస్యలు గుర్తించామని వాటి అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆయన అన్నారు. తాము వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గడ్కరీ తెలిపారు.
'దేశంలో ఇక పెట్రోల్, డీజిల్ వాహనాలు ఉండవ్- భవిష్యత్తులో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కార్' - Nitin Gadkari On Fuel Vehicles