KTR Nirmal District Clash Incident :నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గురువారం రాత్రి కేటీఆర్ రోడ్‌షోలో ఉద్రిక్త చోటుచేసుకున్న ఘటనలో 23 మందిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. కేటీఆర్ ఘటనపై భైంసా పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం రాత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచార సమయంలో ఉద్రిక్తతకు దారి తీసిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు.
భైంసాలో ఉద్రిక్తత - కేటీఆర్‌పై ఉల్లిగడ్డలు, టమాటలు విసిరిన దుండగులు - Attack on KTR in Bhainsa Road Show
ఉద్రిక్తతకు కారకులైన వ్యక్తులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి, అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రచారంలో ఉద్రిక్తతలకు బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు సంయమనం పాటించి, ఎటువంటి వదంతులు నమ్మొద్దని పేర్కొన్నారు. భైంసా అంత ప్రశాంతంగానే ఉందని, ఇక్కడ ఎలాంటి గొడవలు జరగడం లేదని తెలిపారు. పట్టణంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నిందితులందరినీ నిర్మల్ న్యాయస్థానానికి పంపించి, అక్కడి నుంచి ఆదిలాబాద్ కారాగారానికి తరలించినట్లు తెలిపారు.
"గురువారం రాత్రి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కేటీఆర్ రోడ్‌షోలో ఉద్రిక్తత చోటుచేసుకున్న ఘటనలో 23 మందిని ఆరెస్ట్ చేశాం. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించాం. ప్రచారంలో ఉద్రిక్తతలకు బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు సంయమనం పాటించి, ఎటువంటి వదంతులు నమ్మొద్దు. భైంసా అంతా ప్రశాంతంగానే ఉంది. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగడం లేదు. పట్టణంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు". - జానకి షర్మిల, నిర్మల్ జిల్లా ఎస్పీ
కేటీఆర్ భైంసా ఉద్రిక్తత ఘటనలో 23 మంది అరెస్టు : జిల్లా ఎస్పీ (ETV BHARAT) అసలేం జరిగిందింటే?ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం రాత్రి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పర్యటించారు. పాత చెక్‌పోస్ట్ కార్యాలయం కూడలి వద్ద కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. ఆ సమయంలో కొందరు కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన ప్రచారం వాహనంవైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జన సమూహం నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విసిరిన ఉల్లిగడ్డలు, టమాటలు ప్రచార వాహనం సమీపంలో కిందపడ్డాయి. కేటీఆర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా బహిరంగంగానే దాడి జరుగుతున్నా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ పూర్తయిన తర్వాత పోలీసులు అందోళనకారులను చెదరగొట్టారు. రాముడిని ఆరాధించే వారు ఎవరూ ఇలా ప్రవర్తించరని కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ యత్నం : కేటీఆర్ - KTR SLAMS BJP AND CONGRESS
మాకు 12 సీట్లు ఇస్తే, గుంపు మేస్త్రీ ఇంటికి వెళ్లడం ఖాయం : కేటీఆర్ - lok sabha elections 2024