ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది : మంత్రి నిమ్మల - Nimmala Take Charge Minister - NIMMALA TAKE CHARGE MINISTER

Nimmala Took Charge in Minister : ఐదేళ్ల వైసీపీ పాలనలో జలవనరులశాఖను తిరోగమనం పట్టించారని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో రైతులకు తక్షణమే ఉపశమనం కలిగించే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం నిధులను సైతం గత సర్కార్​ దారిమళ్లించిందని ఆరోపించారు. ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తామని నిమ్మల స్పష్టం చేశారు.

Nimmala Ramanaidu Take Charge as Minister
Nimmala Ramanaidu Take Charge as Minister (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 4:32 PM IST

Updated : Jun 20, 2024, 5:20 PM IST

Nimmala Ramanaidu Take Charge as Minister : జలవనరుల శాఖ లాంటి కీలకమైన బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్​కు మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. సచివాలయం నాలుగో బ్లాకులో జలవనరుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వం వ్యవసాయం, రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, కాలువల్లో నీరు పారకుండా చేశారని ఆరోపించారు.

'గుర్రపు డెక్క, పూడిక తీత కోసం మొదటి సంతకం చేశాను. గేట్లు, షట్టర్​లు, లాకుల మరమ్మతు కోసం తక్షణం నిధులు విడుదల చేస్తున్నాం. గత ఐదేళ్లుగా ఎక్కడా డీ సిల్టింగ్ కార్యక్రమం చేయలేదు. అందుకే చుక్క వాన నీరు పడినా అన్ని ప్రాంతాలు మునిగాయి. డీ సిల్టింగ్ ప్రక్రియ చేస్తేనే సీజన్​లో నీరు ఇవ్వగలం, అందుకే దానిపై తొలి సంతకం చేశా. అలాగే వర్షాకాల సీజన్​లో వరదలకు ఏటి గట్లు తెగి పోకుండా ముందస్తు చర్యలు కోసం ఆదేశాలు ఇచ్చాం' అని నిమ్మల రామానాయుడు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం (ETV Bharat)

"రైతులకు తక్షణం నీరు ఇచ్చేందుకు అవరమైన చర్యలు చేపట్టాలి. సాగునీటి రంగాన్ని, వ్యవసాయ రంగాలను గాడిలో పెట్టాలి. జగన్ ఈ రెండు రంగాలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు. పోలవరంతోపాటు, ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా పూర్తి చేస్తాం. గతంలో టీడీపీ హయాంలో రూ.80,000ల కోట్లు సాగునీటి రంగానికి కేటాయింపులు చేశారు. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కునే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మాత్రమే ఏపీ మొత్తాన్ని సస్యశ్యామలం చేయగలం." - నిమ్మల రామానాయుడు, జలవనురుల శాఖ మంత్రి

Nimmala Ramanaidu Fires on Jagan : వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య పోలవరాన్ని విధ్వంసం చేశారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గత సర్కార్ పోలవరాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని విమర్శించారు. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా వారి తప్పులు సమర్ధించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆక్షేపించారు. రివర్స్ టెండర్ ద్వారా పోలవరాన్ని గాలికి వదిలేశారన్నారు. జలశక్తి శాఖ హెచ్చరించినా జగన్ ప్రభుత్వం లెక్కపేట్టలేదని ధ్వజమెత్తారు. ఏజెన్సీనీ, అధికారులను మార్చేశారని, అందుకే డయాఫ్రం వాల్ దెబ్బతిందని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

'2020 వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతింది. అది ప్రభుత్వ తప్పిదమని ఐఐటీ హైద్రాబాద్ నివేదిక ఇచ్చింది. దానిని బాగు చేయాలంటే రూ.447 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. కొత్తది కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుంది. 350 క్యూసెక్కుల మేర సీపేజీ వస్తుందని, గ్యాప్ 3,1 వద్ద 50 నుంచి వంద అడుగుల అగాధాలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టును క్లిష్టతరం చేసేశారు. ఈ సవాళ్లు అధిగమించి పోలవరం నిర్మిస్తాం. నదుల హారాన్ని సాకారం చేస్తాం. గతంలో కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఆ నిధులే 2019-24 మధ్య రీఎంబర్స్​మెంట్​గా వచ్చింది. ఆ మొత్తాన్ని కూడా వైసీపీ సర్కార్ మళ్లించింది. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు' అని నిమ్మల రామానాయుడు అన్నారు.

"పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. ఎన్డీయేలో ఉన్నాం, పోలవరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తాం. తెలుగుజాతి కల అయిన పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తాం. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తాం. మరో ఏడాదిలో పూర్తికావాల్సిన ప్రాజెక్టును వైసీపీ పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పదేళ్లు వెనక్కి నెట్టింది. సుమారు పదేళ్లలో కావాల్సిన పనులను మేం ఐదేళ్లలో చేయాల్సిన పరిస్థితి." - నిమ్మల రామానాయుడు, జలవనురుల శాఖ మంత్రి

ఏపీ జీవనాడైన పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం విధ్వసం చేసింది: మంత్రి నిమ్మల - Irrigation Minister Rama Naidu

'చేతకానితనాన్ని ప్రజల మీదకు నెట్టేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనే' - TDP leader Nimmala Ramanaidu

Last Updated : Jun 20, 2024, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details