ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం - SWEARING CEREMONY IN AP HIGH COURT

ముగ్గురు జడ్జిలతో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

three_additional_judges_swearing_ceremony_in_ap_high_court.
three_additional_judges_swearing_ceremony_in_ap_high_court. (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2024, 5:38 PM IST

Three Additional Judges Swearing Ceremony In AP High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ మహేశ్వరరావు, జస్టిస్‌ తూట చంద్ర ధనశేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి.పొన్నారావు, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ డా.వై.లక్ష్మణరావు, పలువులు రిజిష్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను కొద్దిరోజుల క్రితమే కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఆ సిఫార్సుల ప్రకారం ఏపీ హైకోర్టులో న్యాయవాదులుగా సేవలందిస్తోన్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్‌, గుణరంజన్‌ను అదే హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు - సుప్రీం కొలీజియం సిఫార్సు

ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌తో కూడిన కొలీజియం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, హైకోర్టులోని ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులను సంప్రదించి ఈ ముగ్గురినీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ మే 15న పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొలీజియం పేర్కొంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. అలాగే, కర్ణాటక హైకోర్టులో అదనపు జడ్జిగా ఉన్న జస్టిస్‌ సిద్ధయ్య రాచయ్యను అదే హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమించినట్లు తెలిపారు.

రిపోర్టర్ హత్య కేసులో వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్‌ - నవంబర్‌ 5న ఉత్తర్వులు

ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. వీరిలో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నరేందర్‌ పేరును ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు తాజాగా చేసిన ముగ్గురు పేర్ల సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుతుంది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉంది.

పొన్నవోలుకు హైకోర్టులో షాక్ - భద్రత కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ కొట్టివేత

ABOUT THE AUTHOR

...view details