NDA Leaders Statewide Campaign: ఎన్నికల వేళ ఎన్డీఏ నేతల ప్రచారం ఊరువాడా జోరుగా కొనసాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వైఎస్సార్సీపీ అరాచక పాలనను ఎండగడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే జగన్‌ను గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని నేతలు పిలుపునిచ్చారు.
కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. కృష్ణప్రసాద్ తనయుడు ధీమంత్ సాయి, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ (TNSF), ఐటీడీపీ (ITDP) సభ్యులతో కలిసి ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ రెండో వార్డులో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. తిరువూరు మేరీ మాత విగ్రహం వద్ద టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మధిర రోడ్డులోని ఎస్సీ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
ప్రజాగళం సభ సూపర్ హిట్ - ప్రజలు, కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు - prajagalam Meeting success
అమలాపురంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్, కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పంట పొలాల్లో పనిచేస్తున్న కూలీలను కలిసి బాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.