AP Assembly Turns to Paperless :రాష్ట్ర బడ్జెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేవనెత్తే ప్రశ్నలు, ప్రభుత్వం నుంచి వారికి పంపే సమాధానాలు, సమావేశాల సమయంలో సభ ఎజెండా, సభా కమిటీల రిపోర్టులు ఇలా అన్నీ కాగిత రహితంగా (Paperless) డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చే దిశగా ఏపీ అసెంబ్లీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే నెవా (National e-Vidhan Application)లో రాష్ట్ర అసెంబ్లీ భాగస్వామి కాబోతోంది. దీనికి సంబంధించి త్వరలో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకోనున్నారు.
అసెంబ్లీ నిరవధిక వాయిదా- వైసీపీ విధ్వంస పాలనపై మూడు శ్వేత పత్రాలు - Assembly Sessions End
ఈ దిశగా ఇప్పటికే గుజరాత్, అస్సాం, మణిపూర్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు తదితర రాష్ట్రాల అసెంబ్లీలు డిజిటల్ వ్యవహారాలకు (Other states digital mode) సిద్ధమయ్యాయి. ఇటీవలే ఒడిశాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను డిజిటల్ విధానంలో (Digital Mode) ప్రవేశపెట్టింది. జాతీయ సమాచార కేంద్రం (NIC-National Informatics Centre) ఈ విధానానికి సంబంధించిన సాంకేతిక వ్యవహారాలను పర్యవేక్షించనుంది. ఏపీలోనూ నెవాను అమల్లోకి తీసుకురావడంపై అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు - సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు - లోకేశ్, అనిత ఏమన్నారంటే? - Andhra Pradesh assembly sessions
అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉమాంగ్ నరూల, అదనపు కార్యదర్శి డాక్టర్ సత్యప్రకాష్ ‘నెవా’పై (NeVA) ప్రజంటేషన్ ఇచ్చారు. అంతకుముందు శాసనమండలి ఛైర్మన్ (Legislative Council Chairman) కొయ్యే మోషేనురాజును ఆయన కార్యాలయంలో కలిసి ‘నెవా’ గురించి వివరించారు. సచివాలయంలో సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను కూడా కలిసి మాట్లాడారు. ఏపీ లెజిస్లేచర్ డిజిటలైజేషన్‌కు సంబంధించి డీపీఆర్ పూర్తయితే ఏపీ అసెంబ్లీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఏపీ ఐటీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం చేసుకోవచ్చని తెలిపారు. డిజిటలైజేషన్‌కు 21 కోట్ల రూపాయలు అంచనా వ్యయం అవుతుండగా, ‘నెవా’ కింద కేంద్రం అందులో 60% కేటాయిస్తుందని, మిగిలిన 40 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుందని వివరించారు.
అసెంబ్లీ లాబీలో పవన్‌ను కలిసిన అమరావతి రైతు కూలీలు- పరిహారం ఎత్తివేతపై వినతిపత్రం - AMARAVATI WOMEN problems PROBLEMS
సభ్యుల హాజరు నుంచి ప్రసంగాల వరకు :సభలోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రవేశించినప్పటి నుంచి లోపల వారు మాట్లాడే ప్రతి మాటా డిజిటలైజ్ చేసే విధానం ‘నెవా’లో ఉంది. సభ్యుడు ఎంతసేపు సభలో ఉన్నారు? ఎంత సేపు మాట్లాడారు వంటివన్నీ రిజిస్టర్ అవుతాయి. ప్రస్తుతం సభలో ప్రత్యేకంగా అసెంబ్లీ రిపోర్టర్లు కూర్చొని సభ్యుల ప్రసంగాలను నోట్ చేసుకొని, తర్వాత వాటిని రాసి నివేదికల రూపంలో భద్రపరిచే సంప్రదాయం ఉంది. కాగిత రహిత పద్ధతిలో ఈ విధానానికి స్వస్తి పలకవచ్చు. డిజిటలైజ్ విధానంలో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. సభలోని కమిటీల నివేదికలను కూడా డిజిటల్ రూపంలోనే భద్రపరుస్తారు.
ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ - నేడు శ్వేతపత్రం విడుదల - White Paper on Finance Department