ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ బైపాస్​కు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ - అత్యంత వేగంగా పట్టాలెక్కే అవకాశం - Vijayawada East Bypass Road - VIJAYAWADA EAST BYPASS ROAD

ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నం - వార్షిక ప్రణాళికలో చేర్చిన ఎన్​హెచ్​ ఏఐ

nda_govt_focus_on_national_highways
nda_govt_focus_on_national_highways (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2024, 12:15 PM IST

NDA Goverment Focus on Vijayawada East Bypass Road in AP :రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టగానే విజయవాడకు, రాజధానికి కీలకమైన పలు జాతీయరహదారుల ప్రాజెక్టులు మంజూరు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కిలోమీటర్లు మేర సూపర్‌స్ట్రక్చర్‌ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చింది. వీటితో పాటు రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చి, వాటికి 12,029 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులకు త్వరగా డీపీఆర్‌ (DPR) రూపొందించి, భూసేకరణ పూర్తిచేస్తే వెంటనే టెండర్లు పిలిచి, పనులు అప్పగించేందుకు వీలు ఉంటుంది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు ఎంత త్వరగా సహకరిస్తే, అంత వేగంగా ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.

3 ఎలైన్‌మెంట్లతో తూర్పు బైపాస్‌ :చిన్నఅవుటపల్లి నుంచి కాజ వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌కు అభిముఖంగా తూర్పువైపు మరో బైపాస్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ సన్నాహాలు చేస్తుంది. 50 కిలోమీటర్లు మేర నిర్మించాలని అనుకుంటున్న ఈ బైపాస్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 2,716 కోట్లు కేటాయించారు. దీని కోసం సలహా సంస్థ 3 ఎలైన్‌మెంట్లు సిద్ధం చేసింది. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఈ వారంలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి వివరించనున్నారు. ఈ నెల ఆఖరుకు 3 ఎలైన్‌మెంట్లను ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి పంపాలి. వాటిలో ఒకటి ఖరారైతే డీపీఆర్‌ రూపకల్పన, భూసేకరణ పనులు మొదలు పెడతారు.

రాజధాని అమరావతి కలుపుకొంటూ జాతీయ రహదారి-16 నిర్మాణం - National Highway Near By Amaravati

సూపర్‌స్ట్రక్చర్‌ డిజైన్‌తో వంతెన : ప్రస్తుతం చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి విజయవాడ మీదుగా వెళ్తోంది. వాహన రద్దీ కారణంగా మహానాడు కూడలి నుంచి రామవరప్పాడు రింగ్‌ మీదుగా నిడమానూరు వరకు ప్రస్తుత హైవేపై 4 వరుసల వంతెన నిర్మాణానికి వార్షిక ప్రణాళికలో చోటు కల్పించారు. 7 కిలోమీటర్లు మేర ఇన్నోవేటివ్‌ సూపర్‌స్ట్రక్చర్‌ డిజైన్‌తో (Innovative Superstructure Design) ఈ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. ఈ వంతెన నిర్మాణానికి 669 కోట్లు రూపాయలు కేటాయించారు. భూసేకరణ చేయకుండానే, ప్రస్తుతమున్న హైవే డివైడర్లలో పిల్లర్లు వేసి 4 వరుసల వంతెన నిర్మిస్తారు. ఈ అంశంపై త్వరలో కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి భూసేకరణ అవసరం లేకపోవడంతో డీపీఆర్‌ సిద్ధం చేసి, టెండర్లు పిలిచి, వచ్చే ఏడాది మార్చిలోపు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే అవకాశం ఉంది. ఈ వంతెన నిర్మాణ సమయంలో వాహనదారులకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఇందుకూ కొన్ని ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ఏపీలో రహదారులకు త్వరలో మోక్షం- గోతులు పూడ్చటానికి టెండర్లు - National highway widening works

వినుకొండ-గుంటూరు హైవే విస్తరణ

  • వినుకొండ నుంచి గుంటూరు వరకు 90 కిలోమీటర్లు హైవేను 4 వరుసలుగా విస్తరించాలని భావిస్తున్నారు. ఇందుకు 2,360 కోట్లు రూపాయలు కేటాయించారు. దీనికి సలహా సంస్థ 3 ఎలైన్‌మెంట్లను రూపొందించింది.
  • వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు వరకు 108 కిలోమీటర్లు మేర 4 వరుసలుగా హైవేను విస్తరిస్తారు. ఈ ప్రాజెక్టుకు 3,723 కోట్ల రూపాయలు కేటాయించారు.
  • నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు 24 కిలోమీటర్లు మేర 4 వరుసల హైవేకి 1,040 కోట్ల రూపాయలు కేటాయించారు.
  • తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గామన్‌ జంక్షన్‌లో 2 కిలోమీటర్లు ఫ్లైఓవర్‌ నిర్మాణానికి 150 కోట్ల రూపాయలు కేటాయించారు. కోల్‌కతా-చెన్నై హైవేపై విశాఖపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు కొవ్వూరు వైపు నేరుగా వెళ్లేందుకు వీలుగా దివాన్‌చెరువు సమీపంలో ఒక కొత్తన వంతెన నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
  • విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి షీలానగర్‌ కూడలి వరకు 13 కిలోమీటర్లు నిర్మాణానికి 906 కోట్లు రూపాయలు కేటాయించారు.
  • శ్రీకాకుళం జిల్లా రణస్థలం పట్టణ పరిధిలో 325 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్లు పనులు చేపట్టనున్నారు.
  • శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కియా కార్ల పరిశ్రమ వద్ద హైదరాబాద్‌-బెంగళూరు హైవేపై ఆర్వోబీ నిర్మాణానికి 140 కోట్లు రూపాయలు కేటాయించారు.

ఏపీలో కొత్త జాతీయ రహదారులపై చంద్రబాబు ఫోకస్ - ఇక పనులు స్పీడ్ అప్ - AP Govt Focus on National Highways

ABOUT THE AUTHOR

...view details