National Institutes Facing Problems in AP : రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఏపీకి కేటాయించిన జాతీయ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో కొన్ని పదేళ్లు గడిచినా పూర్తికాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టకపోవడం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా గత ఐదేళ్లు పనుల్లో వేగం మందగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తున్నందున కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే జాతీయ విద్యాసంస్థల పనులు పూర్తి కావడంతో పాటు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాలకు గతేడాది వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించగా ఈసారి బడ్జెట్‌లో అన్నింటికీ కలిపి ఒకే పద్దు కింద కేటాయించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థలాన్ని మార్చడంతో ఒక్క ఇటుకా పడలేదు. 2023-24 సవరించిన బడ్జెట్ అంచనాల్లో తెలంగాణ, ఏపీ గిరిజన వర్సిటీలకు కలిపి 40.67 కోట్లు రూపాయలు కేటాయించారు. కేంద్రీయ వర్సిటీకి గతేడాది సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం 112.08 కోట్లు రూపాయలు ఇచ్చారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు 28 శాతం పెరిగింది. ఈ నిధులను రాబట్టి, పనులు చేస్తే వర్సిటీ నిర్మాణాలు పూర్తవుతాయి.
శిథిలావస్థలో పాఠశాల భవనాలు - కొత్తవి నిర్మించాలని విద్యార్థుల మొర - Dilapidated School Buildings
గిరిజన విశ్వవిద్యాలయం : గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 2014లో టీడీపీ హయాంలో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెంలో 526.24 ఎకరాలను కేటాయించారు. శంకుస్థాపన చేసి, భూమి చుట్టూ 10 కోట్ల రూపాయలతో ప్రహరీ నిర్మించారు. భూసేకరణకు 29.97 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించారు.
మౌలిక వసతులు కల్పించి విశ్వవిద్యాలయానికి అప్పగించే తరుణంలో 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ హయాంలో సేకరించిన భూముల్లో నిర్మాణాలు చేపడితే ఆ ప్రభుత్వానికి పేరు వస్తుందనే దురుద్దేశంతో జగన్ సర్కారు పనులు ఆపేసి, స్థలాన్ని మార్చేశారు. దీంతో జాతీయ విద్యాసంస్థ నిర్మాణం ఐదేళ్లు వెనక్కి పోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా మెంటాడ, దత్తిరాజేరు మండలాల పరిధిలోని చినమేడిపల్లి, మర్రివలస గ్రామాలకు వర్సిటీని మార్చేసింది. ఇందుకు 561.91 ఎకరాలను సేకరించింది. ఇది మైదాన ప్రాంతమైనా, గిరిజన ప్రాంతమని చెబుతూ వర్సిటీ స్థలాన్ని మార్చింది.
అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత జగన్ గతేడాది ఆగస్టు 25న (25-08-2023) శంకుస్థాపన చేసినా ఇంతవరకు ఒక్క ఇటుక పడలేదు. విజయనగరం మండలం కొండకరకం వద్ద ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్ భవనంలో 2019 ఆగస్టు నుంచి గిరిజన విశ్వవిద్యాలయాన్ని(Tribal University) నిర్వహిస్తున్నారు. వసతి చాలకపోవడంతో విద్యార్థుల సంఖ్యను 338కే పరిమితం చేశారు. రైతులకు పరిహారం చెల్లించి, సేకరించిన భూమిని విశ్వవిద్యాలయానికి అప్పగించడంలో జాప్యం జరగడంతో శాశ్వత భవనాలు లేకుండా పోయాయి.
అధికారుల నిర్లక్ష్యం - హైటెన్షన్ తీగలు తగిలి ముగ్గురు విద్యార్థులు మృతి - THREE Students dead
కేంద్రీయ విశ్వవిద్యాలయం :అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, ఆరేళ్లు దాటినా ఇంతవరకు శాశ్వత భవనాలు లేవు. అద్దె భవనాల్లో వర్సిటీని నిర్వహిస్తున్నారు. టీడీపీ హయాంలో 2018లో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద సుమారు 491.30 ఎకరాలు దీనికి కేటాయించారు. 6.68 కోట్ల రూపాయలతో ప్రహరీ నిర్మించారు.
జేఎన్‌టీయూ (JNTU) అనంతపురం ప్రాంగణంలోని భవనాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మొదట ఏర్పాటుచేశారు. పరిపాలనా విభాగం, తరగతులను కొంతకాలం జేఎన్‌టీయూలోనే నిర్వహించారు. వసతిగృహాలు ప్రైవేటు భవనాల్లో నిర్వహించారు. రెండేళ్ల క్రితం తరగతులు, వసతిగృహాలు ఒకేచోట ఉండేలా సీఆర్‌ఐటీ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలను అద్దెకు తీసుకొని అందులోకి మార్చారు. పరిపాలన భవనం మాత్రం జేఎన్‌టీయూలోనే ఉంచారు. కేంద్రం మొదటి విడతలో 350 కోట్లు రూపాయలు మంజూరుచేసి, 135 కోట్లు రూపాయలు విడుదల చేసింది. గతేడాది నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిల వసతిగృహాలు, అతిథిగృహం నిర్మాణాలు పూర్తయ్యాయి. తరగతుల, పరిపాలన భవనాలు చాలావరకు పూర్తయ్యాయి. గత విద్యాసంవత్సరం వరకు అద్దె భవనాల్లోనే తరగతులు కొనసాగాయి. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త భవనాల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రాని ఆర్వో ప్లాంట్లు - విద్యార్థులకు బోరు నీరే గతి! - students suffer drinking water
ఐఐపీఈ పనుల్లో తీవ్ర జాప్యం :ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ(ఐఐపీఈ) శాశ్వత భవనాల నిర్మాణానికి విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో టీడీపీ హయాంలో 201.8 ఎకరాలను కేటాయించారు. ఈ ప్రాంతం చుట్టూ ప్రహరీ నిర్మించారు. అంతలో భూములు ఇచ్చిన రైతుల్లో కొందరు కోర్టును ఆశ్రయించడంతో న్యాయవివాదం ఏర్పడింది. 2022 డిసెంబరులో కోర్టు వివాదం తొలగిపోయింది. ప్రస్తుతం పనులు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఐఐపీఈ శాశ్వత భవనాలకు 850 కోట్లు రూపాయలు అవుతుందని అప్పట్లో ప్రతిపాదించారు. పనుల్లో ఆలస్యం కారణంగా ఈ వ్యయం మరింత పెరగనుంది. కేంద్రం 300 కోట్ల రూపాయలు వరకు మంజూరు చేసింది. చమురుసంస్థలు 200 కోట్ల రూపాయల వరకు ఇచ్చాయి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ(IIPE) సంస్థలను విశాఖపట్నంలో 2016లో ఏర్పాటుచేశారు. ఐఐఎం, ఐఐపీఈ విద్యాసంస్థల తాత్కాలిక ప్రాంగణాలను మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేశారు. ఐఐఎం (IIM) సొంత భవనంలోకి వెళ్లినా, ఐఐపీఈ (IIPE) ఇంకా అక్కడే కొనసాగుతోంది. ఐఐఎంకు కేటాయించిన సర్వే నంబరు 88లో కొన్ని భవనాలు నిర్మించాల్సి ఉండగా, అవి పూర్తికాలేదు.
వెంటాడుతున్న సమస్యలు :
- కర్నూలు ట్రిపుల్‌ఐటీ (DM)లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ట్యాంకర్లతో నీటిని తెచ్చుకుంటున్నారు. విద్యాసంస్థ పై నుంచి హైటెన్షన్ విద్యుత్తు లైన్లు వెళ్తున్నాయి. వీటిని తొలగించాలని ట్రిపుల్‌ఐటీ (IIIT) కోరుతోంది. రెండో విడత భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి.
- అమరావతిలో ఏర్పాటుచేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID)కి సొంత భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. శాఖమూరు వద్ద 50 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో తాగునీరు, చుట్టూ ముళ్లకంపలు, ఇతరత్రా సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో కొంతవరకు పరిష్కరించారు.
ఆ వైద్య కళాశాలలో సీట్లు ఇక లోకల్ విద్యార్థులకే- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జీవో - Dental College Seats
తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఐటీకి (NIT) శాశ్వత అధ్యాపకుల కొరత ఉంది. ఎన్‌ఐటీలో మొత్తం 210 మందికి గాను 43 మందే ఉన్నారు. ఔట్సోర్సింగ్ కింద 110 మందిని నియమించారు. 2021-22 విద్యా సంవత్సరంలో సీట్లను 750 వరకు పెంచగా ఇప్పుడు అధ్యాపకుల కొరత కారణంగా 480కి కుదించారు. ఎన్‌ఐటీలో లోకల్ విద్యార్థులకు 50% కోటా ఉంటుంది. సీట్ల తగ్గింపుతో ఏపీ విద్యార్థులు నష్టపోతున్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)ను తిరుపతిలో ఏర్పాటుచేశారు. ఏర్పేడు మండలం శ్రీనివాసపురంలోని సొంత భవనాల్లో కొన్ని తరగతులు, తిరుపతి సమీపంలోని అద్దె భవనాల్లో మరికొన్ని తరగతులు, ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసపురం సమీపంలో 250 ఎకరాల్లో 690 రూపాయల కోట్లతో భవనాల నిర్మాణానికి 2015లో శంకుస్థాపన చేయగా పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.
గురుకులంలో 100మంది విద్యార్థులకు అస్వస్థత - ఆరోగ్య పరిస్థితిపై మంత్రుల ఆరా - FOOD POISON FOR STUDENTS