National Flag Displayed Upside Down in Medchal District : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. ఈ ఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, మేడ్చల్ మున్సిపాలిటీ వివేకానంద విగ్రహం పార్క్ వద్ద ఛైర్పర్సన్ దీపికా రెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. నాయకులు జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి తలకిందులుగా ఉన్న జెండాను గమనించి సరిచేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయినప్పటికీ జెండాకు అవమానం జరిగిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హరివర్ధన్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు హాజరయ్యారు.