ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీడీపీ-జనసేన-బీజేపీ సభకు భూమిపూజ - ఏర్పాట్లు పరిశీలించిన లోకేశ్ - Nara Lokesh Bhumipuja for Meeting

Nara Lokesh Bhumipuja for TDP, Janasena and BJP Meeting: ఈ నెల 17న పల్నాడు జిల్లాలో జరగబోయే తెలుగుదేశం-జనసేన- బీజేపీ ఉమ్మడి సభా ఏర్పాట్లకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

lokesh_bhumipuja
lokesh_bhumipuja

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 1:53 PM IST

Updated : Mar 13, 2024, 2:40 PM IST

టీడీపీ-జనసేన-బీజేపీ సభకు భూమిపూజ - ఏర్పాట్లు పరిశీలించిన లోకేశ్

Nara Lokesh Bhumipuja for TDP, Janasena and BJP Meeting:పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి సభా ఏర్పాట్లకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. భూమి పూజ కంటే ముందు నారా లోకేశ్​ నేతలతో కలిసి సభా ప్రాంగణం, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మూడు పార్టీల ఉమ్మడి సభకు ప్రధాని నరేంద్రమోదీతో (Prime Minister Narendra Modi) పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Janasena chief Pawan Kalyan) ఈ సభలో పాల్గొననున్నారు.

కూటమిని ఆశీర్వదించండి - సీట్ల సంఖ్య కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం: చంద్రబాబు, పవన్‌

రాష్ట్ర పునర్నిర్మాణం కోసం దిశానిర్దేశం: ఈ సభ జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే సభ కాబోతుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pullarao) తెలిపారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమిని 5 కోట్ల ఆంధ్రులు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురు చూస్తోందని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని 175 నియోజకవర్గాల నుంచి 3 పార్టీల శ్రేణులు పాల్గొంటారని పత్తిపాటి తెలిపారు.

ఎన్నికల యుద్ధక్షేత్రంలో ఈ సభ ఓ మైలురాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని అన్ని ప్రాంతాల ముఖ్య నేతలతో 13 కమిటీలు ఏర్పాటు చేసినట్లు పత్తిపాటి తెలిపారు. జగన్​ను గద్దె దించి తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌, టీడీపీ నేతలు కిలారు రాజేష్‌, సత్యనారాయణరాజు, జనసేన నేతలు బాలాజీ, రాజారమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కొలిక్కివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు - సుదీర్ఘ చర్చల అనంతరం ప్రకటన

చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహణ: ఈ సందర్భంగా సభకు అవసరమైన సామగ్రి తరలించారు. ప్రధాన వేదిక నిర్మాణ పనులకు భూమి చదును చేస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని మూడు పార్టీల నేతలు పేర్కొన్నారు. మూడు పార్టీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారికి ఒకవైపు వాహనాల పార్కింగ్‌ మరోవైపు సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక హెలిప్యాడ్‌ సిద్ధం చేశారు. ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై గుడిపాడు వద్ద విమానాలు దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఎయిర్‌స్ట్రిప్‌ను అధికారులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్రధానమంత్రి హాజరవుతుండటంతో పోలీసుశాఖ కూడా అప్రమత్తమైంది. అధినేతల భద్రత కోసం పోలీసు శాఖ కసరత్తు ప్రారంభించింది.

చంద్రబాబు-ప్రశాంత్‌ కిషోర్‌ భేటీపై వైసీపీ నేతలు విమర్శలు - గట్టిగా కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేతలు

Last Updated : Mar 13, 2024, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details