తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాళ్లకు దణ్ణం సరిగా పెట్టు' - బాలయ్యను ఆటపట్టించిన పురందేశ్వరి! - Balakrishna Rakhi celebrations - BALAKRISHNA RAKHI CELEBRATIONS

Nandamuri Balakrishna Rakhi Celebrations With Family : నందమూరి ఇంట రాఖీ పండుగ వేడుకలు సందడిగా సాగాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన సోదరీమణులతో రాఖీ కట్టించుకున్నారు. ఈ క్రమంలో గత అనుభవాలను నెమరు వేసుకుంటూ, పురందేశ్వరి బాలయ్యను ఆట పట్టించారు. కాళ్లకు దణ్ణం సరిగా పెట్టు అంటూ బాలయ్యను సరదాగా గద్దించింది పురందేశ్వరి. ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.

Nandamuri Balakrishna Rakhi Celebrations With Family
Nandamuri Balakrishna Rakhi Celebrations With Family (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 8:07 PM IST

Nandamuri Balakrishna Rakhi Celebrations With Family :రాఖీ పండుగను నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తన సోదరీమణులు లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరిలతో రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి బాలయ్యను ఆట పట్టించారు. పదేళ్ల వయస్సులో రాఖీ కడితే కేవలం పది పైసలు మాత్రమే ఇచ్చాడంటూ బాల్య స్మృతులను గుర్తుచేసుకున్నారు. అనంతరం బాలకృష్ణ దంపతులు అక్కల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. కాళ్లకు దణ్ణం సరిగా పెట్టు అంటూ పురందేశ్వరి మరోమారు బాలయ్యను చమత్కరించారు.

నందమూరి ఇంట ఘనంగా రాఖీ పండుగ : దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగ ఘనంగా జరిగింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు సైతం ఈ వేడుకను కుటుంబసభ్యుల మధ్య ఆనందోత్సహాంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ విషయానికొస్తే నందమూరి వారి ఇంటా జరిగిన రాఖీ పండుగ వేడుకలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ సందడీ చేస్తున్నాయి. అవును నందమూరి కుటుంబం ఇంట జరిగిన రాఖీ సంబరాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తుంది.

'బాలయ్య సర్ బాలయ్య' అంతే : ఆ వీడియోలో నందమూరి బాలకృష్ణ అక్కాచెల్లెళ్లు భువనేశ్వరి, పురందేశ్వరి, లోకేశ్వరి తమ సోదరుడు బాలయ్యకు రాఖీలు కట్టారు. అనంతరం బాలయ్య సతీసమేతంగా తన సోదరీమణుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా నందమూరి బాలకృష్ణ తనకంటే పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకొవడంతోపాటు రాఖీ కట్టినందుకు తన సోదరీమణులకు కానుకలు ఇచ్చినట్లు వీడియోలో కనిపించింది. అనంతరం బాలకృష్ణ తన సోదరీమణులతో కలిసి అప్యాయంగా ఫోటోలు దిగారు.

ప్రస్తుతం నందమూరి ఇంట్లో జరిగిన ఈ సంబరాలకు సంబంధించిన దృశ్యాలు సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో 'బాలయ్య సర్ బాలయ్య అంతే ' అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఓ పక్క వరుసగా సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లోనూ బాలయ్య బిజీబిజీగా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య, అక్కడ అప్పుడే పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితమే అన్నక్యాంటీన్లను సైతం ప్రారంభించారు.

'NBK-109' : ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య తన 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఆ సినిమాకి ఎటువంటి పేరు పెట్టాలేదు. కేవలం 'NBK-109' టైటిల్​తో ప్రచారం జరుగుతుంది. ఇటీవల దానికి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలయ్యాయి. అదేవిధంగా మళ్లీ ‘అన్ స్టాపబుల్ షో’కి సంబంధించిన పనులూ శరవేగంగా జరుగుతున్నాయి.

బాలయ్య వచ్చేస్తున్నాడు​ - NBK 109 షూటింగ్​ ఎక్కడి దాకా వచ్చిందంటే?

గ్రాండ్​గా బాలయ్య 50 ఇయర్స్ సినీ జర్నీ సెలబ్రేషన్స్​ - ఆహ్వాన పత్రిక ఇదే! - NBK 50 years celebrations

ABOUT THE AUTHOR

...view details