Chandrababu Naidu & Lokesh Wishws to Balakrishna : తెలుగు సినిమా రంగంలో అన్ స్టాపబుల్ అనిపించుకున్న అగ్రహీరో, హిందూపురం శాసనసభ్యులు , ఆత్మీయుడు నందమూరి బాలకృష్ణకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ, రాజకీయ రంగాలలో తిరుగులేని ప్రజాదరణతో నిండు నూరేళ్ళూ ఆనంద, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ పంజా సెంటర్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు.
Nandamuri Balakrishna Birthday Celebrations Across State :శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు మధ్య 64వ పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్, ఎన్టీఆర్ ఆరోగ్య రథం పునఃప్రారంభించారు. అనంతరం స్థానిక జేవిఎస్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అదోగతి చెందిందని, మనం పాతికేళ్లు వెనక్కి వెళ్ళామన్నారు. ప్రభుత్వం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తమకు ఈ అఖండ విజయాన్ని అందించారని వారి నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయమన్నారు. హిందూపురానికి పరిశ్రమలు,రింగ్ రోడ్డు,హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులకు నీరు, చిలమత్తూరు మండలానికి అందించేందుకు కృషి చేస్తానని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమిస్తుందన్నారు.
కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ కార్యాలయంలో బాలయ్య అభిమానులు కేకు కోసం సంబరాలు జరుపుకున్నారు. బసవరామతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, హిందూపురం ఎమ్మెల్యేగా , సినీ నటుడుగా విశిష్ట సేవలందిస్తున్న బాలయ్య బాబు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను చేపడతామని అభిమానులు అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సోమవారం ఘనంగా బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. నరసన్నపేట ఎమ్మెల్యే ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే (MLA) బాలకృష్ణ జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. బొర్రా దిలేష్ యూత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ (NTR) సర్కిల్‌లో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. తెలుగు యువత కార్యకర్తలు టపాసులు కాలుస్తూ జై బాలయ్య నినాదాలతో సందడి చేశారు.