తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చిన నాంపల్లి కోర్టు - ALLU ARJUN BAIL PETITION JUDGEMENT

హీరో అల్లు అర్జున్​కు న్యాయస్థానంలో ఊరట - సంధ్య థియేటర్​ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్​కు రెగ్యులర్​ బెయిల్​ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

NamPally Court in allu Arjun bail petition Judgement
NamPally Court in allu Arjun bail petition Judgement (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2025, 1:56 PM IST

Updated : Jan 3, 2025, 7:55 PM IST

NamPally Court Judgement on Allu Arjun Bail Petition :సినీ హీరో అల్లు అర్జున్​కు నాంపల్లి న్యాయస్థానం రెగ్యులర్​ బెయిల్​ను మంజూరు చేసింది. సంధ్య థియేటర్​ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ హైకోర్టు​ మధ్యంతర బెయిల్​పై ఉన్నారు. రెగ్యులర్​ బెయిల్​పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగియగా తాజాగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసిన కోర్టు :అల్లు అర్జున్​కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్​ను మంజూరు చేసింది.ప్రతి ఆదివారం ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు రెండు నెలల పాటుగా ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు చిక్కడపల్లి పోలీసుల విచారణకు అల్లు అర్జున్​ హాజరుకావాలని కోర్టు అదేశాలు జారీ చేసింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా అర్జున్ దేశం విడిచి వెళ్లకూడదని న్యాయస్థానం అదేశించింది. ఒక్కొక్కరికి రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు తెలిపింది. దీంతో పాటు అల్లు అర్జున్ దర్యాప్తు చేస్తున్న పోలీసులను ప్రత్యక్షంగా,పరోక్షంగా ఎటువంటి బెదిరింపులకు పాల్పడవద్దని కోర్టు సూచించింది. ఈకేసు సంబంధించిన సాక్షులను బెదిరించే ప్రయత్నం చేయవద్దని కోర్టు హెచ్చరించింది.

Verdict On Allu Arjun Bail :ఈ నెల 4న పుష్ప బెనిఫిట్‌ షో రోజు సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా, ఈ నెల 27న రిమాండ్ ముగిసింది. అదే రోజు ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అప్పుడే ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ విచారణ వాయిదా పడగా, సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది.

ఇదీ జరిగింది :పుష్ప-2 బెనిఫిట్​ షో సందర్భంగా కొద్ది రోజుల క్రితం సినీ హీరో అల్లు అర్జున్​ సంధ్య థియేటర్​కు వెళ్లారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్​ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే దిల్​సుఖ్​నగర్​కు చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా కిందపడిపోయి జనాల కాళ్లమధ్య నలిగిపోయారు. ఈ ఘటనలో రేవతి మృతిచెందారు. కాగా ఆమె కుమారుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబ సభ్యులకు ఇప్పటికే అల్లు అర్జున్​ కోటి రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మరోవైపు పుష్ప-2 చిత్ర నిర్మాతలు కూడా సాయమందించారు.

సంధ్య థియేటర్ ఘటన - డీజీపీ, హైదరాబాద్ సీపీకి ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు

అల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్‌ - తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

Last Updated : Jan 3, 2025, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details