Namo Drone Didi Distribution In Rangareddy : వ్యవసాయంలో పురుగుల మందుల పిచికారి ఎంతో కీలకమైంది. పంట ఎదిగే సమయంలో చేతికొచ్చే సమయంలో చీడ పురుగుల నివారణ కోసం పలు రకాల మందులు పిచికారి చేయాల్సి ఉంటుంది. ఏపుగా పెరిగిన పంట పొలాల్లోకి రైతులు వెళ్లి పిచికారి చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారి చేస్తే రైతులకు సులభంగా ఉంటుందని రసాయన, ఫర్టిలైజర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు డ్రోన్లను అందిస్తున్నారు.
Namo Drone Didi : గ్రామంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించి వాళ్ల ద్వారా రైతులకు సాయపడే విధంగా కేంద్రం నమో డ్రోన్ దీదీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ డ్రోన్ దీదీ (Namo Drone Didi)లను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. దేశవ్యాప్తంగా వేయి మందికి పైగా మహిళలకు డ్రోన్‌లను అందజేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొరమాండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 110 మంది మహిళలకు డ్రోన్లు అందించారు. డ్రోన్లు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
"డ్రోన్ ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం కలగనుంది. డ్రోన్ సహయంతో మందులను పిచికారి చేయడం ద్వారా సమయం ఆదా అవుతుంది. శ్రమ లేకుండా తేలికగా మందులు పంటకు పిచికారీ చేయవచ్చు. పైలేట్ శిక్షణ పది రోజులు తీసుకున్నాం. డ్రోన్ స్ప్రే వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. శిక్షణ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. 6 లక్షలు ఖర్చుపెట్టాలంటే మా వల్ల అయ్యే పని కాదు. మా లాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. మాలో ఆత్మ విశ్వాసం పెంచింది. " - డ్రోన్ శిక్షణ తీసుకున్న మహిళలు
లీడ్ చిల్డ్రన్ లైబ్రరీ పేరిట గ్రంథాలయం - చదువే ఆయుధంగా విద్యార్థులకు తోడ్పడుతున్న జంట