తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్‌కు ప్రజాకవి కాళోజీ పురస్కారం - Kaloji Award 2024

Nalimela Bhaskar select for Kaloji Award : సాహితీరంగంలో సేవలందించిన వారికి ఏటా తెలంగాణ ప్రభుత్వం బహుకరించే ప్రఖ్యాత కాళోజీ సాహిత్య పురస్కారానికి ప్రముఖ కవి, రచయిత నలిమెల భాస్కర్‌ ఎంపికయ్యారు. ఈ నెల తొమ్మిదో తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు.

Nalimela Bhaskar select for Kaloji Award
Nalimela Bhaskar select for Kaloji Award (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 9:36 PM IST

Nalimela Bhaskar Select for Kaloji Award : ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024 కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం లభించింది. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సాహితీ పురస్కారం అందిస్తోంది. ఈ ఏడాది అవార్డు గ్రహీత ఎంపిక కోసం ప్రభుత్వం ప్రముఖ కవి అందెశ్రీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.

కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2024 కాళోజీ పురస్కారానికి నలిమెల భాస్కర్‌ను ఎంపిక చేసింది. ఈ నెల తొమ్మిదో తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. నలిమెల భాస్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సన్మానించి 1,01,116 రూపాయల పురస్కారాన్ని అందిస్తారు.

బహుభాషా కోవిదుడు : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన నలిమెల భాస్కర్‌కు 14 భాషల్లో పట్టుంది. తెలుగు అధ్యాపకులుగా పనిచేసి 2011లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, సుద్దముక్క వంటి సంకలనాలను ఆవిష్కరించారు. పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించడంతో పాటు తెలంగాణ పదకోశాన్ని రూపొందించారు. మలయాళ నవల స్మారక శిశిగల్‌ను తెలుగులోకి స్మారక శిలలు పేరిట అనువదించారు. ఈ పుస్తకానికి 2013లో అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది.

పారాలింపిక్స్​ కాంస్య విజేత దీప్తి జీవాంజికి రూ.కోటి నజరానా, గ్రూప్​-2 ఉద్యోగం - CM Felicitates Jeevanji Deepti

వరద బాధితులకు విరాళాలు వెల్లువ - జీఎంఆర్ సంస్థ​ భారీ సాయం - Floods Donors In Telangana

ABOUT THE AUTHOR

...view details