తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి - హుటాహుటిన నీటిని ఆపేసిన అధికారులు - Nagarjuna Sagar Left Canal Cut Off - NAGARJUNA SAGAR LEFT CANAL CUT OFF

Nagarjuna Sagar Left Canal Breached : నాగార్జున సాగర్ ప్రధాన ఎడమ కాలువకు గండి పడింది. పాలేరు ఎగువన 133.06 కి.మీ. వద్ద సాగర్‌ ఎడమ కాలువ తెగిపోయింది. దీంతో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గండిపడటంతో హుటాహుటిన ఎడమ కాలువకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు.

Nagarjuna Sagar Main Left Canal Cut Off
Nagarjuna Sagar Left Canal Breached (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 5:22 PM IST

Updated : Sep 1, 2024, 5:29 PM IST

Nagarjuna Sagar Main Left Canal Cut Off : ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్‌ ప్రధాన ఎడమ కాలువకు భారీగా గండి పడింది. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడటంతో, పంట పొలాల్లోకి ఉద్ధృతంగా వరద నీరు చేరింది. అదేవిధంగా పరిసర గ్రామాల్లోకి భారీగా వరద ముంచెత్తింది. ఉద్ధృతి పెరగడంతో సమీప ఊళ్లు ఖాళీ చేసేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. గండిపడటంతో హుటాహుటిన ఎడమ కాలువకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. ఈ గండితో ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నాగార్జున సాగర్​కు ఇన్ ఫ్లో ఐదు లక్షల క్యూసెక్కులు వస్తుండగా ఔట్ ఫ్లో 4.70 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి వివరించారు. ఈ మేరకు సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్​కు నీటిని నిలిపి వేశారు. అయితే అప్పటికే వర్షపు నీటితో పాలేరు రిజర్వాయర్ నిండి పోవడంతో చేరిన బ్యాక్ వాటర్​తో 133.06 కిలో మీటర్ల వద్ద గండి పడినట్లు అధికారులు మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో పాలేరు నిండుకుండలా మారింది.

Last Updated : Sep 1, 2024, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details