Nadu-Nedu Works Incomplete at Nellore: కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ బడులను తయారు చేశామని ప్రతి పాఠశాలకు అందమైన భవనాలు, ఫర్నిచర్, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, మరుగుదొడ్లు సమకూర్చామని పదేపదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.
ప్రమాదకరంగా పాఠశాల ప్రాంగణం: మెుదటి విడతలో ఏడేళ్లపాటు ఉంటాయని వేసిన రంగులు ఏడాదికే వెలిసిపోగా, మరమ్మతులు చేసిన పాఠశాలల్లో రెండేళ్లు గడవక ముందే సమస్యలు పునరావృతం అవుతున్నాయి. ఆర్వో ప్లాంట్లు పడకేశాయి. మరుగుదొడ్ల తలుపులు ఊడిపోయినా పట్టించుకునేవారు లేరని విద్యార్థులు తెలిపారు. అన్నిచోట్లా మొండిగోడలేదర్శనమిస్తుండగా మరో వైపు పాఠశాల ప్రాంగణాలు నిర్మాణ సామగ్రితో విద్యార్థులు భయంభయంగా చదువుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో చెట్టు కిందనే తరగతులు కొనసాగిస్తున్నారు. మూడు దశల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల దిశ, దశ మార్చేస్తానని చెప్పి ఐదేళ్లలో రెండో విడతే పూర్తి చేయలేదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు.
నాడు - నేడు కష్టాలు తీర్చలేదు
నాణ్యత లోపంగా పనులు: జిల్లాలో నాడు-నేడు మొదటి విడతలో 1060 పాఠశాలల్లో పని చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.పది లక్షల నుంచి రూ. 40 లక్షలు ఖర్చు చేసి అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు తదితర తొమ్మిది రకాల సౌకర్యాలు కల్పించారు. అందుకోసం రూ. 232 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడతలో మొత్తం 1356 పాఠశాలల్లో 8,464 పనులు చేయాలని గుర్తించారు. వాటికి రూ. 453 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వాటిలో 335 ప్రహరీలు, 1008 మరుగు దొడ్లు, 552 బడుల్లో అదనపు తరగతి గదులు, 904 చోట్ల విద్యుత్తు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. వీటిలో సగం కూడా పూర్తికాకముందే మొదటి విడత పనుల నాణ్య తలో డొల్లతనం బయటపడుతోంది. మొదటి విడత పనులు పూర్తి చేసి రెండేళ్లు గడవక ముందే వేసిన రంగులు వెలిసిపోయాయి. నీటిశుద్ధి కేంద్రాలు మూతపడ్డాయి. మరమ్మతులు చేసిన శ్లాబ్ పెచ్చులు ఊడిపోతున్నాయి.
నాడు-నేడు పనుల్లో నాణ్యతా లోపం- పాఠశాలల్లో విద్యార్థుల ఇక్కట్లు ఐదు తరగతులు - ఒకే గది - ఇవేమీ చదువులు - Government School Problems
"పాఠశాలలో కేవలం రెండు మరుగుదొడ్లు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. గత సంవత్సరం నిర్మించిన మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకురావడం లేదు. తరగతి గదిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండడం వల్ల కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది. అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగితే శ్రద్ధగా చదువుకుంటాం. సంవత్సరం నుంచి నాడు-నేడు పనులు చేస్తున్నారు." - విద్యార్థులు
నిలిచిన నాడు-నేడు నిధులు - శిథిలావస్థకు రాళ్లపేట ప్రాథమిక పాఠశాల - RALLAPETA PRIMARY SCHOOL PROBLEMS