ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బట్టతలకు మాత్రల చికిత్స - గుంటూరులో వైద్యుల సదస్సు

గుంటూరులో ఐఏడీవీఎల్‌ కుటికాన్‌-2024 రెండు రోజుల సదస్సు

best_medicine_for_baldness
best_medicine_for_baldness (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Medicine for Baldness: జుట్టు రాలుతోందంటే చాలు ఎంతో మంది కుంగిపోతుంటారు. బట్టతల వస్తుందేమో అన్న భయాందోళనకు గురవుతుంటారు. సబ్బులు, షాంపూలు మార్చడంతో పాటు మార్కెట్​లో దొరికే హెయిర్ ఆయిల్స్ అన్నింటినీ వాడిపడేస్తుంటారు. ఇప్పటికే బట్టతల వచ్చినవాళ్లు హెయిర్ ప్లాంటేషన్​ తో పాటు కొన్న రకాల చికిత్సలు తీసుకుంటున్నారు. ఇంకొందరు విగ్ పెట్టుకుని కవర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బట్టతల వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. బట్టతల సమస్యకు మాత్రలతో చికిత్స మంచి ఫలితం ఇస్తుందని ముంబయికి చెందిన ప్రొఫెసర్‌ రచిత తెలిపారు.

గుంటూరులో ఐఏడీవీఎల్‌ కుటికాన్‌-2024 రెండు రోజుల సదస్సు (ETV Bharat)

గుంటూరులోని శ్రీకన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన భారత చర్మ, సుఖ, కుష్ఠు నిపుణుల సంఘం (ఐఏడీవీఎల్‌) కుటికాన్‌-2024 రెండు రోజుల సదస్సు ఆదివారం ముగిసింది. ఈ వేదికపై ప్రొఫెసర్ రచిత పలు విషయాలు వెల్లడించారు. బట్టతల సమస్యకు పూతమందు లేదా హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్యరంగంలో జరిగిన పరిశోధనలతో మాత్రలు కూడా చక్కని ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. ఈ చికిత్సతో జుట్టు వృద్ధి చెందడం గమనించామని, అయితే వైద్యుల పర్యవేక్షణలోనే మందులు వాడాల్సి ఉందని వివరించారు. జుట్టు రకం, తీరుతెన్నులు, వంశపారంపర్య సమస్యలు విశ్లేషించి ఎంత మోతాదులో మాత్రలు వాడాలో నిర్ణయించాల్సి ఉందని రచిత తెలిపారు. చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకుంటే జట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుందన్నారు.

చర్మ చికిత్సలో లేజర్‌ చికిత్స ఓ భాగమైపోయిందని బెంగళూరుకు చెందిన డాక్టర్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన నానో ఫికో లేజర్స్‌ మచ్చలు, గుంతలు, గీతలు, ముడతలు వంటి ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపగలుగుతున్నామని వివరించారు. ఈ నూతన చికిత్సతో దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయన్నారు. వేదికపై పలువురు ప్రముఖ వైద్యులు మాట్లాడుతూ సొరియాసిస్‌ వ్యాధి బాధితుల్లో కీళ్ల వాపులు, నొప్పులుంటే ప్రత్యేక అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ పరిశోధన పత్రాలు సమర్పించిన వైద్య విద్యార్థులకు, క్విజ్‌ పోటీల విజేతలకు అవార్డులు అందజేశారు. వచ్చే ఏడాదిలో తిరుపతిలో రాష్ట్ర సదస్సును నిర్వహించాలని తీర్మానించారు. ఐఏడీవీఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరుపతికి చెందిన శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు.

జుట్టు రాలడం అనేది తల్లిదండ్రుల ఇరువైపుల నుంచీ వారసత్వంగా వస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అధ్యయనం వెల్లడిస్తోంది. తల్లిదండ్రుల పూర్వీకుల్లో ఎవరివైపైనా బట్టతల వచ్చిన వారు ఉంటే వారసులకు కూడా వచ్చే ఛాన్స్ ఉందని తేలింది. మగాళ్లలో ముందు, మధ్యలో వెంట్రుకలు రాలిపోయి బట్టతల కనిపిస్తుండగా, ఆడవాళ్ల విషయంలో సైడ్స్​లో బట్టతల పాచెస్ కలిగి ఉంటారు.

"తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక" - వీరికి రేషన్​ కార్డులు, వారి ఖాతాల్లో డబ్బులు

నేరుగా రాజమహేంద్రవరం TO ముంబయి - తొలిసారి 'ఎయిర్ బస్' సర్వీసులు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details