Mulberry Cultivation in Siddipet :సెరీకల్చర్ సాగులో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో కేవలం 30 ఎకరాల నుంచి 50 ఎకరాల్లో మాత్రమే సాగు చేసేవారు. ప్రస్తుతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో((Govt Assistance) ) రాష్ట్రంలో 11 వందల 27 ఎకరాల్లో మల్బరీ సాగు జరుగుతోంది. పట్టు పురుగులనూ పెంచుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు.
Farmers Cultivating Mulberry :మిగిలిన పంటలకు భిన్నంగా మల్బరీ సాగు(Mulberry) ఉండటం రైతులకు కలిసి వస్తుంది. ప్రకృతి విపత్తులను తట్టుకుని ఈ పంట నిలుస్తుంది. మొక్క దశలో ఒకటి రెండు తడుల నీరుఅందిస్తే సరిపోతుంది. ప్రతి రెండు వారాలకు ఈ మెుక్కలను కత్తిరించి పట్టుపురుగులకు ఆహారంగా వేస్తున్నారు. పట్టుపురుగులు ఎదిగి మంచి దిగుబడిని అందిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
"నేను మొదట్లో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడిని. ఉద్యోగంలో వచ్చే జీతం అంతంత మాత్రమే ఉండటంతో ఈ సెరికల్చర్ సాగు చేయాలనుకున్నాను. యూట్యూబ్లో ఈ సాగు గురించి కొన్ని వీడియోలు చూడటం ద్వారా కొంత అవగాహన కలిగింది. నాకు ఉన్నటువంటి కొంత భూమిలో ఈ సెరికల్చర్ సాగును చేపట్టాను. సంవత్సరానికి సుమారు 10 పంటలు వస్తున్నాయి" - శ్రీనివాస్, సెరికల్చర్ రైతు చంద్లాపూర్