MP Vemireddy Prabhakar Reddy Meets MLA Manugunta:త్వరలో ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్సార్సీపీ చర్యలతో జిల్లాలోని రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలంతా టీడీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లాలో పలువురు కీలక నేతలు పార్టీని వీడి టీడీపీలో చేరగా, ఎంపీ వేమిరెడ్డి రాజీనామాతో వైఎస్సార్సీపీ గట్టి షాక్ తగిలింది. ఇదిలా ఉంటే 2వ తేదీన టీడీపీలో చేరనున్న వేమిరెడ్డి, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డితో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒక్కొక్కరుగా వైఎస్సార్సీపీని వీడుతున్న నేతలు: నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ కంచుకోటకు బీటలు వారుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. సీఎం జగన్ ఓవైపు నా మటే శాసనం, నేను చెప్పిందే వేదం అంటూ తనకు నచ్చిన వారికి టికెట్లు కేటాయిస్తూ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీతో నడిచిన తమకు, సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశాడని నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆ పార్టీని వీడగా, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేశారు. 2వ తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. మరోవైపు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సైతం పార్టీని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్ - వైఎస్సార్సీపీ చీటింగ్ టీమ్: చంద్రబాబు
ఎమ్మెల్యేతో భేటీ అయిన ఎంపీ: నెల్లూరు జిల్లా కందుకూరులో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. మహీధర్ రెడ్డి స్వగ్రామం మాచవరంలో గంటసేపు మంతనాలు జరిపారు. వేమిరెడ్డి తో పాటు రూప్ కుమార్ యాదవ్ చర్చల్లో పాల్గొన్నారు. మానుగుంటకు వైఎస్సార్సీపీ సీటు రాకపోవడంతో కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉన్నారు. కార్యక్రమాలకు వెళ్లడం లేదు. ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపుతారనే ప్రచారం సాగింది. మార్చి రెండో తేదీ నెల్లూరుకు చంద్రబాబు రానుండటంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మహీధర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించాటానికి వేమిరెడ్డి వచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్
ఉత్కంఠ రేపిన కందుకూరు అభ్యర్థి ప్రకటన: కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డిని సీఎం జనగ్ పక్కనపెట్టారు. ఆయన స్థానంలో ఈ నెల 12న కటారి అరవిందా యాదవ్‌ను పార్టీ సమన్వయకర్తగా నియమించారు. ఆమె తండ్రి డాక్టర్ పెంచలయ్య ఈ నెల మొదటివారంలో సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పుడు ఆయనతోపాటు వచ్చిన కుమార్తె అరవిందను ఈనెల 16వ తేదీన పార్టీ సమన్వయకర్తగా నియమించారు. ఆమె నియోజకవర్గంలో అడుగుపెట్టకుండానే, ఆ స్థానంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు. ఇప్పటికే వైఎస్సార్సీపీపై అసంతృప్తితో ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మాట్లాడటానికి వేమిరెడ్డి మాగుంటతో భేటీ అయ్యారని తెలుస్తోంది.
అభ్యర్థుల మార్పుపై 24 గంటల్లోనే మాట మార్చిన జగన్- 5నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల మార్పు