MP Kalisetti Appala Naidu Met Akshaya Patra Foundation Chairman SG Chandra Das :రాష్ట్రంలో ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యత చేపట్టనున్న అక్షయ పాత్ర సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల చైర్మన్ ఎస్జీ చంద్రదాస్ను హైదరాబాదులోని హరికృష్ణ గోల్డెన్ టెంపుల్లో గల ఆశ్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. ఇదే సందర్భంలో ఎస్జీ చంద్రదాస్ నుంచి అప్పలనాయుడు ఆశీర్వాదం తీసుకున్నారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయ పాత్ర సంస్థకు అప్పజెప్పడం అభినందనీయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
రాష్ట్ర ప్రజలకు గుడ్న్యూస్ - అన్న క్యాంటీన్ ప్రారంభంపై ఉత్తర్వులు జారీ
2014 నుంచి 2019 వరకు అప్పటి నారా చంద్రబాబు నాయుడు సూచనలపై రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు. మంచి పేరు తెచ్చుకున్న అక్షయపాత్ర సంస్థ, ఈసారీ కూడా పేదవారికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించాలని కోరారు. మంచి పేరు తెచ్చుకోవాలని అక్షయపాత్ర సంస్థ ఎంపీ అభ్యర్థించారు. యావత్ దేశంలోనే మంచి పేరు ఉన్న పేదవారికి అన్నం పెట్టే బృహత్తర కార్యక్రమం అన్నా క్యాంటీన్ల నిర్వహణను చంద్రబాబు నాయుడుఆలోచనలకు తగ్గట్టుగా ఊహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.