Mother Murdered Son by Cutting Him into Pieces: హైదరాబాద్‌లోని మీర్ పేట్‌లో భార్యను ముక్కలుగా నరికి హత్య చేసిన దారుణ ఘటన మరువక ముందే ప్రకాశం జిల్లాలో అలాంటి దారుణమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని తెలుగు వీధిలో 35 ఏళ్ల కన్న కుమారుడు శ్యామ్‌ను కన్నతల్లి సాలమ్మ ఓ ఆటో డ్రైవర్ మోహన్ తో కలిసి హత్య చేయించింది. తరువాత శరీర భాగాలను ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కుక్కి మేదర బజారు సమీపంలోని పంట కాలువలో పడేశారు. తర్వాత ఏమీ జరగనట్లు ప్రశాంతంగా ఉండిపోయారు.
మూడు గోనెసంచుల్లో శరీర భాగాలు: అనంతరం సాలమ్మ పెద్ద కుమారుడు సుబ్రమణ్యం ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తమ్ముడిని ఆస్తికోసం తన తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్‌తో కలిసి హత్య చేసినట్లుగా పోలీసులకు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి మూడు గోనెసంచుల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. అనంతరం తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్‌తో పాటు శ్యామ్ పెద్దన్న అయినా సుబ్రహ్మణ్యాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.