ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నమయ్య జిల్లాలో విషాదం - ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసున్న తల్లి - Mother Committed Suicide - MOTHER COMMITTED SUICIDE

mother who committed suicide with her children: అన్నమయ్య జిల్లాలో వివాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో పాటు గండిమడుగులో దూకి ఆత్యహత్య చేసుకున్న తల్లి. కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు రోదించారు.

mother_suicide
mother_suicide

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 6:38 AM IST

Updated : Apr 20, 2024, 8:18 AM IST

Mother Committed Suicide With Her Children Annamayya District :కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యలు చేసుకోవడం ఈ మధ్య కాలంలో తరచూ వింటూ ఉంటాం. చిన్న చిన్న కలహాలు పచ్చని కుటుంబాలు మధ్య చిచ్చుపెడుతున్నాయి. సమస్యల పరిష్కర దిశగా వెళ్లాల్సిన వారు తమకు ఆత్మహత్యనే శరణ్యమని భావిస్తున్నారు. తమతో పాటు ముక్కుపచ్చలారని పిల్లలను కూడా వారితో పాటు అనంత లోకాలకు తీసుకువెళ్తున్నారు. తాజాగా తన ముగ్గురు పిల్లలతో కలిసి జలాశయంలోకి దూకి ఓ తల్లి ఆత్మహత్య చేస్తున్న సంఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తుంది.

కర్ణాటకలో విషాదం - ఇద్దరు పిల్లలతో కలిసి మంటల్లో దూకి తల్లి ఆత్మహత్య - Three Were Burned Alive

అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గాలివీడులోని చిలకలూరి పేటకు చెందిన వేముల నాగమణి (30) తన ముగ్గురు పిల్లలతో కలిసి గండిమడుగు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి నాగమణి ఆమె భర్త విక్రమ్​లప గొడవ పడ్డారు. దీంతో ఆమె మనస్థాపం చెంది రాత్రి 8 గంటల సమయంలో తన పిల్లలు నవ్యశ్రీ (10), దినేశ్​ (6). జాహ్నవి (3)లను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.

అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యయత్నం - భర్త మృతి - Couple Suicide Attempt

స్థానికులు, పోలీసులు తెలిపినా వివరాల ప్రకారం, చిలకలూరి పేటకు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వేముల విక్రమ్​ ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చాలీ చాలని కుటుంబ ఆదాయంతో తరచు ఇంట్లో గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి భార్య నాగమణి తో గొడవ జరిగినట్లు సమాచారం. గొడవ పెద్దది కావడంతో తమ పిల్లలతో కలిసి నాగమణి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపనకు గురై వెలిగల్లు ప్రాజెక్ట్​ వద్ద ఉన్న గండిమడుగులో పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుంది. గండిమడుగు ఒడ్డున ఉన్న చెప్పులు, సెల్​ఫోన్​ ఆధారంగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గండిమడుగులో నీటిలో తేలియాడుతున్న మృతదేహాలను వెలికి తీయించారు. నాగమణి బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్త విక్రమ్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో చిలకలూరిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Apr 20, 2024, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details