Modi On Ramoji Rao Demise : ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ రావు అని అన్నారు. పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని అన్నారు. మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని పేర్కొన్నారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని తెలిపారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని గుర్తు చేశారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాని తెలిపారు. రామోజీరావు కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు మోదీ సానుభూతి తెలిపారు.
CM Revanth Reddy On Ramoji Rao Demise: రామోజీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారని తెలిపారు. తెలుగు పారిశ్రామికరంగానికి రామోజీ విలువలు జోడించారని తెలిపారు. మీడియా రంగంలో రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. రామోజీరావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అస్తమయం - Ramoji Rao Passes Away