MLA Komatireddy Rajgopal Reddy Meets Minister Ponnam :హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలిశారు. ఆయన మునుగోడు నియోజకవర్గంలోని ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖకు చెందిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మునుగోడు నియోజకవర్గంలో 21 కొత్త రూట్లల్లో పలు గ్రామాలను కలుపుతూ బస్సులు నడిపించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి, నారాయణపూర్ మండలాలకు కొత్త బస్ షెల్టర్ల నిర్మాణం చేయాలని పొన్నం ప్రభాకర్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు.
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇచ్చిన వినతులపై మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలను పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, షాద్‌నగర్ ఎమ్మెల్యేలు సంజయ్, విజయరమణరావు, శంకర్, కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ ఛైర్మన్ వినోద్ కుమార్‌లు భేటీ అయ్యారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో గల్ఫ్ బాధితుల సమస్యలను సీఎంతో చర్చించినట్లు తెలిపిన వినోద్ కుమార్, విదేశాల నుంచి సీఎం రాగానే గల్ఫ్ కార్మిక సమస్యలపై కార్మికులు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామని వేం నరేందర్‌రెడ్డి తెలిపారు.