Misbehavior on Woman at Scanning Center in Visakha:విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళను సిబ్బంది వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖకు చెందిన ఓ మహిళ తలకు గాయమై సోమవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లింది. స్కానింగ్ చేయించాలని వైద్యులు చెప్పడంతో అదే ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్‌కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇన్‌ఛార్జి ప్రకాశ్ దురుద్దేశంతో స్కానింగ్ కోసం దుస్తులు తీసేయాలని ఆమెకు చెప్పాడు.
ఆ తర్వాత ఆమెతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ కేకలు వేయడంతో అక్కడే ఉన్న స్థానికులు స్పందించి ప్రకాశ్‌కు దేహశుద్ధి చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న విశాఖ 3వ పట్టణ సీఐ రమణయ్య హాస్పటల్‌కు చేరుకుని ప్రకాశ్‌ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో రోగులు నరకం చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి బంధువులకు! - యువకుడి ప్రాణం తీసిన 2 వేలు