Minor Girl Stabbed to Death in Anakapalli District :అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. ఏడాదిగా వెంటపడుతుండటంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద యువకుడిని అరెస్టు చేశారు. బాలికపై కక్ష పెంచుకున్న ఉన్మాది ఇటీవల బెయిల్‌పై విడుదలై ఆమె ఇంటిలోనే కత్తితో కిరాతంగా హత్య చేశాడు.
అత్తతో వివాహేతర సంబంధం- మేనమామను హత్య చేసిన మైనర్ బాలుడు - Young Man Killed The Uncle
బాలిక దారుణ హత్య :అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో చదువుతున్న ఓ బాలిక యువకుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. రాంబిల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికను సురేష్ అనే యువకుడు ఆమె ఇంట్లోనే కత్తితో కిరాతకంగా పీక కోసి హత్య చేశాడు. బాలిక ఇంట్లోంచి యువకుడు బయటికి రావడాన్ని ఆమె నానమ్మ చూశారు. అనుమానంతో వెంటనే లోపలికి వెళ్లిన ఆమె రక్తపు మడుగులో ఉన్న మనవరాలిని చూసి కేకలు వేశారు. చుట్టుపక్కలవారు వచ్చి బాలికను పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కశింకోటకు చెందిన సురేష్‌కు ఆ గ్రామంలో బంధువులు ఉన్నారు. ఏడాదిగా బాలిక వెంట పడుతున్న ఉన్మాదిపై ఆమె తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన యువకుడు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలికను హతమార్చాడు. బిడ్డ హత్యతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.