ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటన- ప్రభుత్వ సహాయ చర్యలపై పరిశీలన - Ministers Visit Floods Areas

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 12:23 PM IST

Ministers Visit Godavari Floods Areas :వరద ముంపు మండలాల్లో మంత్రుల బృందం ఇవాళ పర్యటించనుంది. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, తణుకు, తాడేపల్లిగూడెంలో మంత్రులు అచ్చెన్న, అనిత, నిమ్మల, పార్థసారథి పర్యటనలో పాల్గొనున్నారు.

minister_visit
minister_visit (ETV Bharat)

Godavari Floods in AP :ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు ఇంకా జలదిగ్బందంలోనే ఉన్నాయి. ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేల ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు నీటి మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించున్నారు.

తగ్గని గోదావరి వరద ఉద్ధృతి - జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు - Godavari floods in ap

Ministers Visit Godavari Floods Areas :ఇవాళ ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ముంపు మండలాల్లో మంత్రుల బృందం పర్యటించనుంది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, హోంమంత్రి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు, తణుకు, తాడేపల్లిగూడెంలో మంత్రుల పర్యటన సాగనున్నట్లు సమాచారం.

వరద బాధితులను ఆదుకుంటాం- పంట నష్టాన్ని అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశాలు - Chandrababu on Floods in AP

క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటన : వరదలకు నష్టపోయిన వరి నారు మడులను, ఉద్యన పంటలను మంత్రుల బృందం పరిశీలించనుంది. ప్రాథమికంగా పంట నష్టం, బాధితులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యటించున్నారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం అయ్యి, ముంపు గ్రామాల సమస్యలను సమీక్షించనున్నారు.

జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు - అవస్థలు పడుతున్న ప్రజలు - Godavari floods in ap

ABOUT THE AUTHOR

...view details