ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు - ప్రజలకు మంత్రుల సూచన - Ministers Review on Heavy Rains - MINISTERS REVIEW ON HEAVY RAINS

Ministers Review on Rains Falling Across the State: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రులు ఎప్పటికప్పుడు వర్ష ప్రభావంపై ఆరా తీస్తున్నారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బలగాల ద్వారా సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. మరో 24 గంటల వరకూ వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

ministers_review_on_rains
ministers_review_on_rains (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 5:49 PM IST

Ministers Review on Rains Falling Across the State:వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anita) విపత్తు నిర్వహణ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి ఎప్పటికప్పుడు వర్ష ప్రభావంపై సమీక్షిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బలగాల ద్వారా సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు.

నలుగురు మృతి చెందడంపై విచారం: విజయవాడలోని మొగల్రాజపురంలో కొండ చరియలు విరిగిపడి నలుగురు మృతి చెందడంపై హోంమంత్రి విచారం వ్యక్తం చేశారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని సహాయక సిబ్బందికి ఆదేశాలిచ్చారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నందున అధికారులు సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

కీలకమైన రహదారుల్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి ట్రాఫిక్ ఏర్పడకుండా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. మరో 24 గంటల వరకూ వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉండాలని ప్రజలకు హోంమంత్రి సూచించారు.

గుంటూరు జిల్లా: వాగులో కొట్టుకుపోయిన కారు-ముగ్గురు మృతి - Car washed out three dead

Minister Kollu Ravindra:కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి కొల్లు రవీంద్ర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీగా కురుస్తున్న వర్షాలపై ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విజయవాడలో పలు ప్రాంతాలు నీట మునగడంపై ఆరా తీశారు. నీళ్లు నిలిచిపోయిన ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కాలువల్లో నీరు పారేలా అడ్డంకులు తొలగించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మ్యాన్ హోల్స్, విద్యుత్ స్తంభాల విషయంలో అప్రమత్తం చేయండని సూచించారు. అధికారులు వర్ష ప్రభావం తగ్గే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

Minister Angani Sathya Prasad:రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దని అన్నారు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు,రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడిన చోట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలకు ఉధృతంగా ప్రవహించే వాగుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని అన్నారు.

విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు - నలుగురు మృతి - రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం - Landslide in Vijayawada

వైఎస్సార్సీపీ నాయకుడి వేధింపులు - విజయవాడ సీపీ కార్యాలయానికి ముంబయి నటి కుటుంబసభ్యులు - Actress Jathwani Family met CP

ABOUT THE AUTHOR

...view details