తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 2200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది : తుమ్మల నాగేశ్వర్​రావు - Minister Tummala Review Meeting

Minister Tummala Nageswara Rao Review Meeting : రాష్ట్రంలో పడుతున్న అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. పంట నష్టపోయిన అన్నదాతల వివరాలు నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలానే రానున్న మూడు రోజులు వర్షాలు పడతాయని, పంట కొనుగోలు కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Crop Loss in Telangana
Minister Tummala Review Meeting

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 8:31 PM IST

Minister Tummala Nageswara Rao Review Meeting on Sudden Rains : రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు అందాయని తెలిపారు. తాజాగా కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల ప్రభావం, సంభవించిన పంట నష్టంపై మంత్రి ఆరా తీశారు. దాదాపు 2200 ఎకరాల వరకు వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని చెప్పారు.

బీజేపీ బీఆర్​ఎస్​ లోపాయికారి ఒప్పందంతో కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నాయి : తుమ్మల - Tummala on BJP and BRS

Sudden Rains Crop Loss in Telangana: పంట నష్టం సంభవించిన ప్రాంతాలను వెంటనే సందర్శించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పూర్తి స్థాయిలో పంట నష్టపోయిన రైతుల వివరాలు వెంటనే సేకరించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వరి పంట కోతలు ఊపందుకున్న నేపథ్యంలో వచ్చే రెండు, మూడు వారాల పాటు అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి అకాల వర్షాలు సంభవించే సందర్భంలో పంట నష్టం తగ్గించే విధంగా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కర్షకులకు సూచించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

బీజేపీ బీఆర్​ఎస్​ లోపాయికారి ఒప్పందంతో కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నాయి : తుమ్మల - Tummala on BJP and BRS

"రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం వల్ల పంట నష్టంపై అధికారులతో చర్చించాం. శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షం వల్ల పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. రానున్న 3, 4 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి. పంట కొనుగోలు కేంద్రాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులకు కావాల్సిన సౌకర్యాలు అందించాలని అధికారులకు తెలిపాం." - తుమ్మల నాగేశ్వరరావు , వ్యవసాయ శాఖ మంత్రి

Tummala Nageswara Rao Suggestions on Rains :జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులు సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం బస్తాలు, ఇతర పంటలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఇందుకోసం రైతుల సౌకర్యార్థం ఇప్పటికే 2 లక్షలకు పైగా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం భట్టితో మంత్రి తుమ్మల భేటీ - వ్యవసాయపథకాల అమలుపై కసరత్తు - MINISTER THUMMALA on farmer schemes

'యాసంగిలో వరి వేయొద్దని చెప్పినా వినలేదు - పంటలు ఎండిపోవద్దని నాణ్యమైన కరెంట్' - farmer loan waiver

ABOUT THE AUTHOR

...view details