తెలంగాణ

telangana

ETV Bharat / state

బీజేపీ సిద్ధాంతంతో మాకు సంబంధం లేదు - ప్రొటోకాల్​లో భాగంగానే ప్రధాని మోదీకి రేవంత్ స్వాగతం : మంత్రి సీతక్క - PM Modi Adilabad Tour

Minister Seethakka Review on Arrangements For PM Modi Tour : ప్రధాని మోదీ సోమవారం ఆదిలాబాద్​ పర్యటనకు వస్తున్నందున ప్రొటోకాల్​లో భాగంగా ఆహ్వానించడానికి సీఎం రేవంత్​ రెడ్డి వస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బీజేపీ సిద్ధాంతానికి కాంగ్రెస్​ సరిపోదని, రాజ్యాంగబద్ధంగానే పీఎంకు సీఎం స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్​లో పీఎం పర్యటన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.

PM Modi Telangana Tour
PM Modi Tour

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 9:36 PM IST

బీజేపీ సిద్ధాంతంతో మాకు సరిపోదు - రాజ్యాంగబద్ధంగానే పీఎంకు స్వాగతం మంత్రి సీతక్క

Minister Seethakka Review on Arrangements For PM Modi Tour :బీజేపీ సిద్ధాంతంతో కాంగ్రెస్​ పార్టీకి ఎప్పటికీ సరిపోదని, అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన విధానమే తప్పితే, మరో కోణం ఉండబోదని రాష్ట్ర మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆదిలాబాద్​లో ప్రధానమంత్రి అధికారిక సభ (PM Modi Sabha) ఏర్పాట్లను పరిశీలించిన ఆమె, జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​, ఎస్పీ గౌస్​ ఆలం, ఖానాపూర్​ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) సోమవారం ఆదిలాబాద్​ పర్యటనకు వస్తున్నందున ప్రొటోకాల్​లో భాగంగా ఆహ్వానించడానికి సీఎం రేవంత్​ రెడ్డి వస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకుంటామని, అలాగే రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్​ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

బీజేపీ సిద్దాంతంతో మాకు ఎప్పటికీ సరిపోలదు. అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన విధానమే తప్పితే మరో కోణం ఉండబోదు. ప్రొటోకాల్​ ప్రకారమే సోమవారం సీఎం రేవంత్​ రెడ్డి పీఎంకు ఆహ్వానం పలుకుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి తీసుకుంటాం. అలాగే కేంద్రానికి ఇవ్వాల్సిన నిధులను రాష్ట్రం నుంచి ఇస్తాం."- మంత్రిసీతక్క,

ఆ నాలుగు అక్షరాలే బీజేపీ అజెండా : కిషన్​ రెడ్డి

PM Modi Telangana Tour :లోక్​సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) ముంగిట ప్రధాని నరేంద్ర మోదీరాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఆదిలాబాద్​, మంగళవారం సంగారెడ్డిలో పీఎం పర్యటించనున్నారు. సుమారు రూ.15 వేల కోట్ల విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగంతో పాటు బీజేపీ శ్రేణులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆదిలాబాద్​ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు పీఎం మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రూ.6,697 కోట్ల విలువ చేసే పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఆదిలాబాద్​-బేలా, హైదరాబాద్​, భూపాలపట్నం రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. రామగుండం ఎన్​టీపీసీ నిర్మించిన థర్మల్​ విద్యుత్​ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం ఆరు గంటల నుంచే ఆదిలాబాద్​ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. ప్రధాని ప్రర్యటన(PM Tour) ఉన్నప్పటికీ, ఇంటర్​ విద్యార్థుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని జిల్లా ఎస్పీ ఆలంగౌస్​ తెలిపారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు.

మార్చి 5న సంగారెడ్డిలో ప్రధాని పర్యటన : మార్చి 5న ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి విమానయాన పరిశోధన సంస్థను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. సుమారు రూ.9,021 కోట్ల విలువ చేసే పనులకు పీఎం మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగించనున్నారు.

తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన - మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్​ పోటీ

ఎన్టీపీసీ పవర్​ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.. రూ.8 వేల కోట్ల పనులు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details