Minister Seethakka on Sarpanch Elections 2024 : సర్పంచులకు చెల్లించాల్సిన 16 నెలల బిల్లులకు సంబంధించిన రూ.1200 కోట్లను గత సర్కార్ పక్కదారి పట్టించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ఆరోపించారు. ఎప్పటికప్పుడు సర్పంచుల బిల్లులు చెల్లిస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. జీతాలు పింఛన్లు చెల్లించడానికి కూడా అక్కడ ఏమీ లేదన్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు.
Seethakka Visit Vemulawada Temple : అంతకుముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదలు అందజేశారు. ఉద్యోగులకు ప్రతినెలా 5లోపు జీతాలు, పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీతక్క వివరించారు.
ఆద్యకళ పరికరాల పరిరక్షణ కోసం ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుకు కృషి : మంత్రి సీతక్క
ప్రజల సంక్షేమం కోసమే నిధులను వెచ్చిస్తున్నాం : ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులు, నిధులను కట్టడాలకు తమ సొంత అవసరాలకు వృధాగా ఖర్చు చేయడం లేదని సీతక్క అన్నారు. ప్రజల సంక్షేమం కోసమే నిధులను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని సీతక్క స్పష్టం చేశారు.