ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.2 కోట్లు కాదు - ఏకంగా రూ.700 కోట్లు నొక్కేశారు! - గొర్రెల పంపిణీ స్కామ్​లో తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు - Two Officers Arrest In Sheep Scam - TWO OFFICERS ARREST IN SHEEP SCAM

Sheep Distribution Scam in Telangana : గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. పశు గణాభివృద్ధి సంస్థ సీఈవో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య పూర్వ ఎండీ రాంచందర్‌ నాయక్, పశు సంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాజీ ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

sheep_distribution_scam_in_telangana
sheep_distribution_scam_in_telangana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 12:06 PM IST

రూ.2 కోట్లు కాదు - ఏకంగా రూ.700 కోట్లు నొక్కేశారు! - గొర్రెల పంపిణీ స్కామ్​లో తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు (ETV Bharat)

Two Officials Arrested in Sheep Distribution Scam in Telangana : గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పశు గణాభివృద్ధి సంస్థ సీఐవో రాంచందర్‌ నాయక్‌, మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ను విచారించిన అనంతరం రూ.700 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అంచనాకు వచ్చింది. తొలుత సుమారు రూ.2 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించగా, ఆరుగురిని అరెస్టు చేశారు.

ఇప్పటిదాకా సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకుల స్థాయి అధికారులు అరెస్టవగా, ఇప్పుడు ఏకంగా సీఐవో స్థాయి అధికారి, మాజీ మంత్రి మాజీ ఓఎస్డీ కటకటాలపాలయ్యారు. రాంచందర్‌ గతంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గానూ పని చేశారు. ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించి పశు గణాభివృద్ధి సంస్థ సీఈవోగా నియమించింది.

నిధుల్ని పక్కదారి పట్టించి : లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో తొలుత కేసు నమోదైంది. అధికారుల ఆమ్యామ్యాల అంశం ముడిపడి ఉండటంతో ఏసీబీ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి దర్యాప్తు ఆరంభించింది. పశు సంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి, అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని రూ.2 కోట్లు మళ్లించినట్లు తేలడంతో ఆ నిధులు ఏమయ్యాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేసింది. బినామీ ఖాతాదారులను విచారించగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభించాయి.

రైతుల సొమ్ము కాజేసిన వ్యవసాయ సహాయకుడు- దాదాపు ₹కోటికి పైగా స్వాహా

ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించిన మొయినుద్దీన్‌ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరెస్టయిన వారి నుంచి సేకరించిన సమాచారం, రికార్డుల ఆధారంగా రాంచందర్, కల్యాణ్‌ల పాత్ర తేటతెల్లమైంది. నాంపల్లి ఏసీబీ కేసుల న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

త్వరలో మరిన్ని అరెస్టులు :2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించి వేల మంది లబ్ధిదారులకు దాదాపు రూ.4 వేల కోట్ల విలువైన జీవాలను పంపిణీ చేశారు. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. రాంచందర్, కల్యాణ్‌ను న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించింది. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయి. అంతకుముందు రాంచందర్​ను అరెస్ట్‌ చేసేందుకు అధికారులు మాసబ్‌ట్యాంక్‌లోని ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లారు. తమ వెంట రావాలని నిర్దేశించగా తొలుత ఆయన అంగీకరించలేదు. చివరకు బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. కొందరు సిబ్బంది అడ్డుతగిలినా, వెనక్కి తగ్గని ఏసీబీ అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరించి రాంచందర్‌ను అరెస్ట్‌ చేశారు.

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ - ఇద్దరు కాపరులు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details