Minister Nimmala Ramanaidu Inspects Budameru Leakage Works :బుడమేరు కాలువపై జలవనరుల శాఖ రెండు గండ్లు పూడ్చి వేసినట్లు స్పష్టం చేసింది. మూడో గండి పూడ్చివేత పనులను యంత్రాంగం మొదలు పెట్టింది. బుడమేరు గండ్ల పూడికలో లక్ష్యానికి చేరువలో ఉన్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రస్తుతం బుడమేరు కాలువకు 9 వేల క్యూసెక్కుల వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి వస్తోందన్న ఆయన ముమ్మరంగా పనులు పూర్తి చేస్తున్నామన్నారు. బుడమేరు గండ్ల పూడికలో ముందడుగు వేశామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు రెండో గండి పూడిక పనులు పూర్తి చేశామని వెల్లడించారు.
బుడమేరు రెండు గండ్లు పూడ్చివేత- పనులపై చంద్రబాబుకు నివేదిస్తున్న మంత్రి నిమ్మల - BUDAMERU LEAKAGE WORKS - BUDAMERU LEAKAGE WORKS
Ramanaidu Inspects Budameru Leakage Works: భారీ వర్షాలు, వరదలతో బుడమేరు కాలువకు పడిన గండ్లలో రెండు పూడ్చివేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రస్తుతం బుడమేరు కాలువకు 9 వేల క్యూసెక్కుల వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి వస్తోందన్నారు. మూడో గండిని చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2024, 12:12 PM IST
మూడో గండిని చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నామని తెలిపారు. ఇవాళ మూడో గండిని పూడ్చి సింగ్ నగర్‌కు వరద ముంపుని తొలగిస్తామని తెలిపారు. సింగ్ నగర్‌కు వరదను నియంత్రించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు తెలిపారు. గత ఐదు రోజుల నుంచి గట్టుపైనే ఉండి దగ్గరుండి పనులు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబుకు గంట గంటకు పనులపై నివేదిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన సలహాలు, సూచనలతో పనులు ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. పూడ్చి వేత పనుల్లో సికింద్రాబాద్ లోని ఆర్మీ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్సు పాల్గొన్నారు.
వాన కురుస్తున్నా, వరద పోటెత్తుతున్నా, చీకట్లు కమ్ముకున్నా మంత్రి రామానాయుడు మాత్రం బుడమేరు కాల్వ గట్ల నుంచి కదలడం లేదు. బుడమేరు కట్టపైనే భోజనం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో సమీక్షిస్తుంటే, మంత్రి క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు. బుధవారం మంత్రి లోకేశ్ కూడా గండ్ల పూడ్చివేత పనులను పరిశీలించారు. విజయవాడ మునకకు కారణం బుడమేరు మళ్లింపు కాల్వకు గండ్లు పడటమేనని మంత్రి రామానాయుడు అన్నారు. వీటిని పూడ్చితేనే నగరానికి ఉపశమనమని పేర్కొన్నారు. దగ్గరుండి చేయిస్తేనే, ఏ పని అయినా త్వరగా అవుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకమని, అదే స్ఫూర్తిని పాటిస్తున్నానని చెప్పారు. అన్ని గండ్లు పూడ్చిన తర్వాతే నగరానికి వస్తానని మంత్రి రామానాయుడు చెప్పారు.
విజయవాడ వరద విలయానికి గత ప్రభుత్వమే కారణం : మంత్రి నిమ్మల - Minister Nimmala About Budameru