Minister Narayana on AP Capital Amaravati Construction Work :రాజధాని అమరావతి నిర్మాణ డిజైన్లలో ఎలాంటి మార్పులు లేవని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే నిర్మాణంలో ఆర్టిఫిషియల్ టెక్నాలజీని వాడుతామని చెప్పారు. అమరావతి అభివృద్ధి పనుల కోసం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31లోగా టెండర్లు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. పాత టెండర్ల కాల పరిమితి ముగిసినందున న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి సీఆర్డీఏ ఆధ్వర్యంలో రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో బిల్డింగ్ల నిర్మాణం పూర్తి చేస్తామని నారాయణ స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణ డిజైన్లలో ఎలాంటి మార్పులు లేవు. నవంబర్ 15 నుంచి టెండర్లు పిలుస్తాం. డిసెంబర్ 31లోగా టెండర్లు ప్రక్రియ పూర్తి చేస్తాం. జనవరి నుంచి అభివృద్ధి పనులు ప్రారంభం చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో బిల్డింగ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. -నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
ఇక జెట్ స్పీడ్లో అమరావతి పనులు - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్లు