Minister Narayana on Liquor Tenders in AP : మద్యం టెండర్ల విషయంలో తనపై చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. బార్లు, మద్యం వ్యాపారాలను గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలు లాక్కొన్నారని ఆరోపించారు. మద్యం టెండర్లు వేయొద్దని తాను ఎవరినీ బలవంతం చేయలేదని స్పష్టం చేశారు.
ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు :నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చని, మద్యం టెండర్లు వేసుకోవచ్చని నారాయణ తెలిపారు. గత ఐదేళ్లల్లో వ్యాపారం చేసుకోవాలంటే భయపడేవారని ఆరోపించారు. తమ కార్యకర్తలతో తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కష్టపడిన కార్యకర్తలకు సంవత్సరానికి 10 కోట్లు చొప్పున 50 కోట్లు ఇస్తానని చెప్పానని, ఇప్పటి కే 2 కోట్లు ఇచ్చానని గుర్తు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ వ్యాపారం చేయాలన్న నెల్లూరులో 10 నుంచి 20 శాతం షేర్ ఇవ్వాల్సి వచ్చేదని అన్నారు. అందరూ వ్యాపారం చేసుకోని రాష్ట్రానికి ఆదాయం పెరగాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎవరైనా వ్యాపారం చేయడానికి స్వేచ్ఛ ఉంటుందని తేల్చి చెప్పారు.
మందుబాబుల ఆరోగ్యానికి గ్యారెంటీ! - జే బ్రాండ్‌కు బై బై - ఇక ప్రైవేటు మద్యం అమ్మకాలు - New Liquor Policy 2024 in AP
వైఎస్సార్సీపీ జీరో అయిపోతుందన్న భయం :250 కుటుంబాలకు ఆదాయం వచ్చే నిర్ణయాన్ని అడ్డుకొని గతంలో నెల్లూరులో హోటల్ కట్టకుండా అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక నిమిషాల్లో అనుమతులు ఇస్తున్నామని, దీనీ వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడం సహా పలువురికి ఉపాధి కలుగుతుందని వివరించారు. నెల్లూరులో తాను అభివృద్ధి చేసుకుంటూ పోతే వైఎస్సార్సీపీ జీరో అయిపోతుందన్న భయం వారిలో ఉందని ఎద్దేవా చేశారు.
AP Wine Shop Tenders 2024 :రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును సర్కార్ రెండురోజులు పొడిగించింది. మొదట జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ గడువు బుధవారంతో ముగియనుంది. అర్జీదారుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకూ గడువు పెంచారు. ఈ నేపథ్యంలో 11వ తేదీకి బదులుగా 14న లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేస్తారు. 16వ తేదీ నుంచి కొత్త లైసెన్సుదారులు దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. అదేరోజు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు.
లిక్కర్ లక్కు ఎవరికో! - మద్యం షాపుతో జాతకం మారేనా? - రాయబారాలు ఫలించేనా!
మద్యం దుకాణాల్లో మాకు షేర్ ఇవ్వండి - లేదా వాటిని వదిలేయండి - AP Wine Shop Tenders 2024