Minister Narayana Comments : టిడ్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, సకల వసతులతో టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తామని, వాటిల్లో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే హక్కు పత్రాలు జారీ చేస్తామని తెలిపారు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గేటెడ్ కమ్యూనిటీల స్థాయిలో టిడ్కో ఇళ్ల ప్రాంగణాలు అభివృద్ధి చేస్తున్నామని, మార్చి చివరి నాటికి అన్ని హంగులతో వాటిని లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు.
చిలకలూరిపేటలో అన్న క్యాంటీన్ భవనం, టిడ్కో గృహ సముదాయాన్ని మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. తొలుత చిలకలూరిపేట ఎన్టీఆర్ సెంటర్‌లోని అన్నా క్యాంటీన్ భవనాన్ని పరిశీలించారు. పనుల పురోగతి, వసతులపై అధికారులతో మాట్లాడారు. అనంతరం టిడ్కో గృహ సముదాయంలో ఇళ్లను పరిశీలించారు. అందులో నివసిస్తున్న లబ్ధిదారులతో మాట్లాడారు. చిలకలూరిపేట నుంచి టిడ్కో గృహ సముదాయం, కమ్మవారిపాలెం మీదుగా నరసరావుపేట వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.
చివరి అంకానికి అన్న క్యాంటీన్ల ఏర్పాటు- మున్సిపల్ కమిషనర్లతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ - Minister Narayana video conference
షీర్‌వాల్ టెక్నాలజీతో నిర్మాణం: ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నారాయణ ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా 100 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 103 క్యాంటీన్లను ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తెస్తామన్నారు. అందులో భాగంగా చిలకలూరిపేటలోని 3 అన్నా క్యాంటీన్ భవనాల్లో చక్కగా పనులన్నీ పూర్తి చేశారని, అధికారులను అభినందించారు. అలానే చిలకలూరిపేటలో పేదలు ఉన్నారని ఆనాడు మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కోరడంతో 5 వేల టిడ్కో ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. షీర్‌వాల్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టామని తెలిపారు. సాధారణం కంటే చదరపు అడుగుకు 100-200 రూపాయల ఎక్కువ ఖర్చు అయినా ఎక్కువకాలం దృఢంగా ఉండాలనే ఆ టెక్నాలజీని ఎంచుకున్నామని అన్నారు.
దానికి కూడా పేర్లు పెట్టిన అదే వైఎస్సార్సీపీ నేతలు గడిచిన అయిదేళ్లలో పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ఏం చేశారో దేశం మొత్తం చూసిందని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. పైగా నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తలపెట్టిన ఇళ్ల నిర్మాణం మొత్తాన్ని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొన్నిచోట్ల 4 గోడలు కట్టి స్లాబులు వేశారని, మనిషి పడుకోవడానికి కూడా సరిపోవని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేనే కామెంట్ చేశారన్నారు. ఇప్పుడు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో పేదలకు ఆత్మగౌరవంతో ఉండేలా సకల వసతులతో టిడ్కో ఇళ్లు పూర్తిచేసి అందించే అవకాశం లభించిందన్నారు. చిలకలూరిపేట టిడ్కో గృహ సముదాయానికి పాఠశాల, ఆస్పత్రి, కమ్యూనిటీ హాల్ కావాలని ప్రత్తిపాటి కోరారని, ఈ మూడింటిని మంజూరు చేశానన్నారు. మార్చి నెలాఖరులోగా వాటన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు.
వైఎస్సార్సీపీ నిర్వాకంతో రాష్ట్ర ఖజానా ఖాళీ: మంత్రి నారాయణ - Minister Narayana Started Gym
ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ, టిడ్కో ఇళ్ల గృహసముదాయంలో నివసిస్తున్న వారికి ఇవాళ ఒక పండగ దినమని, మంత్రి నారాయణ వరాలు కురిపించారన్నారు. ఆస్పత్రి, పాఠశాల, కమ్యూనిటీ హాల్ మంజూరు చేయడంపై ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు మంత్రి నారాయణ చేతుల మీదుగానే ఎలక్ట్రానిక్ డ్రా తీసి 4 వేల 512 టిడ్కో ఇళ్లను కేటాయించామన్నారు. గత పాలకులు రంగులు వేసుకున్నారు పోయారన్నారు. రంగులు పిచ్చి తప్ప పేదవాడి ఇంటి కల నెరవేరుద్దామనే ఆలోచన గత పాలకులకు లేదన్నారు. ఇక్కడ నివసించే వారు గర్వపడే విధంగా కొత్త నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నామని వివరించారు. నిజమైన లబ్ధిదారులకే ఇళ్లను కేటాయిస్తామన్నారు.
చంద్రబాబు పాలనను చెక్కపెడుతున్నారు: అనంతరం ఒంగోలులోని రాజీవ్ గృహకల్ప కాలనీలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కాలనీలో సమస్యలు తెలుసుకున్న మంత్రి నారాయణ, కాలనీలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ.2.30 కోట్లు మంజూరు చేశారు. 100 రోజుల్లోపు పనులు పూర్తికావాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో ఖజానా ఖాళీ అయిందని, సమర్థుడైన చంద్రబాబు పాలనను చెక్కపెడుతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తామని తెలిపారు.
నవీ ముంబైలో మంత్రి నారాయణ పర్యటన- అభివృద్ధి ప్రాజెక్టులపై పరిశీలన - Minister Narayana Navi Mumbai Tour