Minister Lokesh Review Skill Census With Officials : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా సమర్థవంతంగా చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సెస్ సర్వే నిర్వహణపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లిలో మంత్రి లోకేశ్ సమీక్షించారు. స్కిల్ సెన్సెస్‌లో భాగంగా యువతకు చెందిన విద్య, ఉపాధి, నైపుణ్య ప్రొఫైల్స్‌ను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెస్యూమ్ తయారు చేస్తుందన్నారు. ఈ ప్రొఫెల్స్‌ను ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామని చెప్పారు. తద్వారా ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
స్కిల్ సెన్సెస్ సర్వే అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమేనని, ఆ దిశగా నైపుణ్య గణన జరగాలని మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు, జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నైపుణ్య గణన తర్వాత యువత కోసం స్కిల్ డెవలప్మెంట్కు చర్యలు చేపడతామని తెలిపారు. నైపుణ్యాల కొరతతో యువతకు ఉద్యోగాలు దొరకడం లేదని మంత్రి లోకేశ్ అన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పన ఈ రెండు అంశాలే నైపుణ్య గణన అంతిమ లక్ష్యమని లోకేశ్ చెప్పారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
దేశంలోనే తొలిసారి మంగళగిరిలో నైపుణ్య గణన సర్వే - సమాచారం ఎలా సేకరిస్తారు ? - Skill Calculation Survey
స్కిల్ సెన్సెస్ కోసం రూపొందించిన యాప్‌లో పొందుపరిచిన అంశాలను అధికారులు వివరించారు. యాప్‌లో పలు మార్పులు చేయాలని లోకేశ్ అధికారులకు సూచించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీల ర్యాంకింగ్స్ మెరుగుదలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
Nara Lokesh Praja Darbar: మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సమస్యలు చెప్పుకొన్నారు. భూసమస్యలపై కొందరు విజ్ఞప్తులు సమర్పించారు. తెలుగు- సంస్కృత అకాడమీలో టైమ్ స్కేల్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని హెచ్ఆర్ఏ, సీసీఏ సిబ్బంది కోరారు. రెగ్యులరైజ్ చేసినా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదంటూ ఏపీ సాంకేతిక విద్యాశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు లోకేశ్‌ను కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం ఇప్పించాలని కోరారు. బెంగళూరు విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న మేనల్లుడు కనిపించడం లేదని అతడి ఆచూకీ కనుక్కునేందుకు సహకరించాలని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన ఓ వ్యక్తి విన్నవించారు.
'నైపుణ్య గణనకు ఏర్పాట్లు చేయండి' - అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశం - Minister Lokesh on Skill Census