Minister Ram Prasad Reddy on Sankranti Busses:కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన తొలి సంక్రాంతికి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. గతంలో పండగ ప్రత్యేక సర్వీసులు అంటే ప్రయాణికులపై అదనపు బాదుడు ఉండేదని కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులపై అదనపు భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రైవేటు సర్వీసులలో కూడా ఆర్టీసీతో సమానంగా టికెట్ రేట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అతి త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుందని వెల్లడించారు.
దిల్లీలో గడ్కరితో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాయలసీమలో కొన్ని రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా మార్చేందుకు సానుకూలంగా స్పందించారని అన్నారు.