ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్చి 1 నుంచి ఇంటర్​ - 17 నుంచి పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్​ విడుదల

ఇంటర్​, పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ను విడుదల చేసిన మంత్రి లోకేశ్ - విద్యార్థులకు ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడి

Minister Lokesh releases tenth class exam schedule
Minister Lokesh releases tenth class exam schedule (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Updated : 5 hours ago

Tenth Class Exams Schedule :ఇంటర్​,పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Minister Nara Lokesh) ఎక్స్ వేదికగా విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు ( AP SSC Exam Schedule) జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్త తీసుకున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు :

తేదీసబ్జెక్ట్
మార్చి 17ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19సెకండ్​ లాంగ్వేజ్
మార్చి 21ఇంగ్లీష్
మార్చి 22ఫస్ట్ లాంగ్వేజ్​ పేపర్-2
మార్చి 24గణితం
మార్చి 26ఫిజికల్ సైన్స్
మార్చి 28బయోలాజికల్ సైన్స్
మార్చి 29

OSSC మెయిన్ లాంగ్వేజ్​ పేపర్ 2,

వోకేషన్ కోర్స్ (థియరీ)

మార్చి 31 సోషల్ స్టడీస్

Intermediate Exam Schedule 2025 :ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్​ను నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ లోకేశ్​ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు :

తేదీ సబ్జెక్ట్
మార్చి 1 సెకండ్ లాంగ్వేజ్​
మార్చి 4 ఇంగ్లీష్
మార్చి 6

మేథమేటిక్స్ పేపర్ -1A

బోటనీ

సివిక్స్

మార్చి 8

మేథమేటిక్స్ పేపర్ -1B

జువాలజీ

హిస్టరీ

మార్చి 11

ఫిజిక్స్

ఎకనామిక్స్

మార్చి 13

కెమిస్ట్రీ

కామర్స్

సోషియాలజి

ఫైన్ ఆర్ట్స్

మ్యూజిక్

మార్చి 17

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్​

బ్రిడ్జ్ కోర్స్ మేథమేటిక్స్

మార్చి 19

మోడరన్ లాంగ్వేజ్

జాగ్రఫీ

మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు :

తేదీసబ్జెక్ట్
మార్చి 3సెకండ్ లాంగ్వేజ్
మార్చి 5ఇంగ్లీష్
మార్చి 7

మేథమేటిక్స్ పేపర్ -2A

బోటనీ పేపర్-2

సివిక్స్ పేపర్-2

మార్చి10

మేథమేటిక్స్ పేపర్ -2B

జువాలజీ పేపర్-2

హిస్టరీ పేపర్-2

మార్చి 12

ఫిజిక్స్

ఎకానమిక్స్

మార్చి15

కెమిస్ట్రీ

కామర్స్

సోషియాలజి

ఫైన్ ఆర్ట్స్

మ్యూజీక్

మార్చి 18

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్

లాజిక్ పేపర్-2

బ్రిడ్జ్ కోర్స్ మేథమేటిక్స్ పేపర్ -2

మార్చి 20

మోడరన్ లాంగ్వేజ్

జాగ్రఫి పేపర్

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ - మీకు నచ్చిన మీడియం ఎంచుకోవచ్చు

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details